https://oktelugu.com/

‘బిగ్ బాస్ 5’కి డేట్ ఫిక్స్.. హోస్ట్ గా కొత్త స్టార్ !

బిగ్ బాస్ తెలుగు -5 సీజన్ కి డేట్ ఫిక్స్ అయిందా ? స్టార్ మా బిగ్‌బాస్ 5 సీజన్‌ కు కసరత్తు ప్రారంభించిందా ? అవునని తెలుస్తోంది. ‘మా టీవీ’ వారు తమ అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ నిర్వహించింది. అయితే ఈ పోల్ కి వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. మేం షో మిస్ అవుతున్నాం అంటూ చాలామంది చెప్పుకొచ్చారు. దీంతో […]

Written By:
  • admin
  • , Updated On : January 28, 2021 / 09:47 AM IST
    Follow us on


    బిగ్ బాస్ తెలుగు -5 సీజన్ కి డేట్ ఫిక్స్ అయిందా ? స్టార్ మా బిగ్‌బాస్ 5 సీజన్‌ కు కసరత్తు ప్రారంభించిందా ? అవునని తెలుస్తోంది. ‘మా టీవీ’ వారు తమ అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ నిర్వహించింది. అయితే ఈ పోల్ కి వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. మేం షో మిస్ అవుతున్నాం అంటూ చాలామంది చెప్పుకొచ్చారు. దీంతో అతి త్వరలోనే బిగ్‌బాస్ 5 సీజన్ ను ప్రారంభించాలని స్టార్ మా సన్నాహాలు చేసుకుంటుంది.

    Also Read: ‘వర్క్ ఫ్రం హోం’పై జాన్వి ఘాటు వ్యాఖ్యలు

    బిగ్‌బాస్-5 సీజన్‌కు కూడా హోస్ట్‌గా నాగార్జుననే వ్యవహరించబోతున్నారని వార్తలు వస్తున్నా.. హీరో రవితేజను సీజన్ 5 కి హోస్ట్ గా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఏది నిజమో. ఏది ఏమైనా ఈ సారి షోలో ఉత్కంఠత పెంచేందుకు నిర్వాహకులు భారీగా స్కెచ్ లను సిద్ధం చేస్తున్నారట. బిగ్ బాస్ విజేత ఎవరన్న సస్పెన్స్‌ లాస్ట్ ఎపిసోడ్ వరకూ అలాగే ఉంచాలని మేకర్స్ సిద్ధం అవుతున్నారట. అలాగే కంటెస్టెంట్స్ మధ్య ఎమోషనల్ జర్నీని కూడా ఈ సారి కొత్తగా ప్లాన్ చేయబోతున్నారట. ఇక బిగ్ ‌బాస్ మొదలైందంటే చాలు అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి.

    Also Read: కేజీఎఫ్2 నైజాం హక్కులకు అంత డిమాండా?

    ఈ షో పై ఎన్నో విమర్శలు వచ్చినా రేటింగ్ ‌లో దూసుకుపోతుండటం విశేషం. అయితే, ఈ సారి పాల్గొనే హోస్ట్ ‌కు, కంటెస్టెంట్‌ కు భారీ మొత్తంలో నజరానా ఇవ్వడానికి బిగ్‌బాస్ రెడీగా ఉందట. ఇక 5వ సీజన్ కోసం దూకుడు ప్రదర్శిస్తున్న నిర్వహకులు అన్నీ కుదిరితే ఆగస్టు 29న షోను ప్రారంభిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి తెలుగులోనూ బిగ్‌బాస్ హవా బాగా కొనసాగుతోంది. 20 మందిని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఓ ఇంటిలో ఉంచి గేమ్స్ ఆడిపిస్తూ వారి ఎమోషన్స్ ను హైలైట్ చేస్తూ, వారి ఫీలింగ్స్ తో ఆడుకుంటూ మొత్తానికి షోను బాగా నడుపుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్