Prabhas Dance Master: ఈశ్వర్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రభాస్…ఈ సినిమా ఆశించిన వరకు విజయాన్ని సాధించలేదు. ఇక రాఘవేంద్ర తో ఆయన పూర్తిగా డిజాస్టర్ బాట పట్టాడు. ఇక మూడో సినిమా అయిన వర్షంతో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన చత్రపతి, మున్నా, బిల్లా డార్లింగ్, బుజ్జిగాడు, మిర్చి లాంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇక ప్రభాస్ తన ఎంటైర్ కెరీర్ లో చేసిన సినిమాలు అతన్ని టాప్ హీరోగా మార్చేశాయి. అయితే ప్రభాస్ కెరియర్ స్టార్టింగ్ లో ఇండస్ట్రీకి రాకముందు రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్నాడు. రాజేష్ మాస్టర్ దగ్గరుండి మరీ స్టెప్పులు ఎలా వెయ్యాలి నేర్పేవాడట… దాంతో ప్రభాస్ డాన్సర్ గా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణించాడు. ప్రభాస్ ‘చక్రం’ సినిమా చేస్తున్న సమయంలో ఒక సాంగ్ కి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సమయంలో రాకేష్ మాస్టర్ వేసిన స్టెప్ ప్రభాస్ అనుకున్నట్టుగా వేయలేదు. రాకేష్. మాస్టర్ ప్రభాస్ మీద కోపగించుకున్నారట.
ప్రభాస్ కి సైతం రాజేష్ మాస్టర్ మీద కోపం వచ్చిన కూడా ఎంతైనా తనకు ముందు నుంచి డాన్స్ నేర్పిన గురువు కాబట్టి ఏమి అనకుండా ఓపిక గా ఉన్నాడట. మొత్తానికైతే రాకేష్ మాస్టర్ ప్రభాస్ ని తిట్టాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి.
ఇక ఏది ఏమైనా కూడా రాకేష్ మాస్టర్ తనకు అవకాశాలు సరిగ్గా రాకపోవడంతో ఆ తర్వాత కాలంలో తను డిప్రెషన్లకు వెళ్లిపోయి ఎవరిని పడితే వాళ్ళని మీడియం ముందుకు వచ్చి తిడుతూ తన ఇమేజ్ ను చాలా వరకు డ్యామేజ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎక్కువగా మందు తాగి అనారోగ్య కారణంతో ఆయన మృతి చెందాడు.
ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ కి మొదట డ్యాన్స్ నేర్పిన గురువు కావడంతో అతనంటే ఇప్పటికి ప్రభాస్ కి చాలా రెస్పెక్ట్ ఉందని పలు సందర్భాల్లో చెబుతుండటం విశేషం…ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ లాంటి రెండు సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతుండడం విశేషం…