Prabhas Radhe Shyam Movie Review: తారాగణం : ప్రభాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, సత్యరాజ్, సచిన్ ఖేదేకర్, భాగ్యశ్రీ తదితరులు.
దర్శకత్వం : కె.రాధాకృష్ణ,
కథా రచయిత : కె.రాధాకృష్ణ కుమార్,
ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస,
కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు,
సంగీతం, నేపధ్య సంగీతం: జస్టిన్ ప్రభాకరన్,
నిర్మాతలు : భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్.
Also Read: ‘రాదేశ్యామ్’ పై రాజమౌళి రివ్యూ ఇదే
‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాంతో సినిమాలో అదనపు హంగులు కోరుకుంటారనే.. మేకర్స్ ఈ సినిమాని అన్ని ఎమోషన్స్ తో నింపేశారు. కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మరి, ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం
కథ :
విక్రమాదిత్య (ప్రభాస్) ఒక ఫేమస్ పామిస్ట్. ఇండియాకి ఎమర్జన్సీ వస్తోందని ఇందిరా గాంధీకి ముందే చెబుతాడు.
దాంతో ఆమె ఆగ్రహానికి గురి అయిన అతను ఇండియా వదిలి లండన్ వెళ్ళిపోవాల్సి వస్తోంది. అయితే, ప్రేమను, పెళ్లిని పెద్దగా నమ్మని విక్రమాదిత్య కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ప్రేరణ (పూజా హెగ్డే) ను చూసి ప్రేమలో పడతాడు. కానీ, ప్రేరణ ఎక్కువ రోజులు బతకదు అని తెలుస్తోంది. ఇంతకీ ఆమెకు ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి ? చివరకు విక్రమాదిత్య – ప్రేరణ ఒక్కటయ్యారా ? లేదా ? అసలు విక్రమాదిత్య జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ? అతని గురువు పరమహంస (కృష్ణం రాజు) పాత్ర ఏమిటి ? మొత్తం ఈ కథకు విక్రమాదిత్య ఎలాంటి ముగింపు ఇచ్చాడు ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
సింపుల్ గా చెప్పాలంటే.. సినిమాలో విజువల్స్ బాగున్నా.. సోల్ మిస్ అయ్యింది. ప్రభాస్ – పూజా పాత్రల మధ్య కెమిస్ట్రీ ఉన్నా ప్రేమ మిస్ అయ్యింది. దీనికితోడు హాలీవుడ్ మేకర్స్ కూడా షాక్ అయ్యేలా.. మా
సినిమా భారీ స్థాయిలో ఉంటుంది అంటూ ఈ సినిమా మేకర్స్ చెప్పిన మాటలకు, సినిమాలోని, సాంకేతిక వర్గం పనితనానికి పొంతన లేదు. భారీ బడ్జెట్ తో రూపొందింది అని పేరే గానీ, సినిమాలో ఒక్క క్లైమాక్స్ కి తప్ప ఇక దేనికి బడ్జెట్ పెట్టలేదు.
సినిమా చూసి ప్రేక్షకులు విజిల్స్ తో కేకలతో ఊగిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా.. ఆ ఊపు మాత్రం రాలేదు. ప్రేక్షకుల్లో ఎక్కువమంది పంచుకున్న అభిప్రాయం ప్రకారం.. ‘రాధేశ్యామ్’ బోరింగ్ ప్లేతో సాగే లాజిక్ లెస్ లవ్ డ్రామా. మొత్తానికి ప్రపంచస్థాయి సినిమా అంటూ వచ్చి.. దిగువస్థాయి సినిమా అయిపోయింది.
కాకపోతే, ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ప్రభాస్ -పూజల కెమిస్ట్రీ కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యింది. ఎమోషనల్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ లో విజువల్స్ సినిమా స్థాయికి తగ్గట్టు లేవు. కాకపోతే ఊహించని రీతిలో క్లైమాక్స్ ను డిజైన్ చేయడం నిజంగా గొప్ప విషయమే. ప్రభాస్ డ్రెస్సింగ్.. యాక్టింగ్ ఆకట్టుకున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్సీ,
పూజా హెగ్డే గ్లామర్ అండ్ క్రేజ్,
భారీ విజువల్స్,
మైనస్ పాయింట్స్ :
లాజిక్ లెస్ లవ్ డ్రామా,
స్లో నేరేషన్,
స్లోగా సాగే స్క్రీన్ ప్లే,
సినిమాటిక్ టోన్ మరీ ఎక్కువ అవ్వడం,
స్క్రిప్ట్ సింపుల్ గా ఉండటం.
సినిమా చూడాలా ? వద్దా ?
ప్యూర్ లవ్ డ్రామా వ్యవహారాలతో సాగిన ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ అండ్ సీన్స్ బాగున్నాయి. అలాగే సినిమా మెయిన్ పాయింట్ లో కంటెంట్ ఉంది, కానీ, మిగిలిన బాగోతం అంతా రొటీన్ బోరింగ్ అండ్ సిల్లీ వ్యవహారాల తతంగమే. దాంతో అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది.
రేటింగ్ : 2.25 / 5
Also Read: ‘రాధేశ్యామ్’ పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్