Prabhas : ప్రభాస్(Rebel Star Prabhas) తో సినిమా చేయడమంటే ఆషామాషీ విషయం కాదు అనేది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. ఆయన సినిమా అంటే కనీసం 300 కోట్ల రూపాయిల లిక్విడ్ క్యాష్ చేతిలో ఉండాల్సిందే. అందులో ప్రభాస్ రెమ్యూనరేషన్ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఇది కేవలం మినిమం బడ్జెట్ మాత్రమే. గరిష్ట బడ్జెట్ విషయం లో ఎవ్వరూ అంచనా వేయలేరు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి తో ఒక పీరియాడికల్ లవ్ స్టోరీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను కూడా గ్రాండ్ గా మొదలు పెట్టుకుంది ఈ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం దాదాపుగా 600 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారట. పుష్ప సిరీస్ మొత్తం కలిపి చూసినా ఇంత బడ్జెట్ ఉండదు. ప్రభాస్ కూడా ఈ సినిమాని వేగంగా పూర్తి చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాడు.
Also Read : ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?
ప్రస్తుతం ఆయన యూరోప్ టూర్ లో ఉన్నాడు. ఇండియా కి తిరిగి రాగానే కొత్త షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ఈ సినిమా సంగతి అటు ఉంచితే ‘రాజా సాబ్’ చిత్రం పరిస్థితి ఏమిటి?, ప్రభాస్ ఈ ఏడాది ఈ సినిమా కోసం ఒక్క రోజు డేట్ కూడా కేటాయించలేదంటే నమ్ముతారా?, కానీ నమ్మాలి, అదే నిజం కాబట్టి. ఈ సినిమా గ్రాఫిక్స్ ఔట్పుట్ పై ప్రభాస్ తీవ్రమైన అసంతృప్తి ని వ్యక్తం చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని సన్నివేశాలు కూడా ఆయనకు నచ్చలేదట. ఇవన్నీ మళ్ళీ రీ షూట్ చేయమని డైరెక్టర్ మారుతీ కి చెప్పాడట. అదే విధంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా హై క్వాలిటీ తో ఉండేలా రీ వర్క్ చేయించమని చెప్పాడట. గ్రాఫిక్స్ వర్క్ పనిదినాలు సంగతి పక్కన పెడితే, కేవలం టాకీ పార్ట్ ని పూర్తి చేయడానికి ప్రభాస్ 45 రోజుల డేట్స్ ని కేటాయించాల్సి ఉందట.
ఈ ఏడాది కచ్చితంగా ఈ సినిమా విడుదల అవుతుందని అనుకున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ఈ ఏడాది ఈ చిత్రం వచ్చే సమస్యే లేదట. వచ్చే ఏడాది సంక్రాంతికి, లేదా సమ్మర్ కి దింపే యోచనలో ఉన్నారట. ఇప్పటికే ఈ చిత్రం పై అభిమానుల్లో అంచనాలు పెద్దగా లేవు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ‘హరి హర వీరమల్లు’ ఎలాగో, ప్రభాస్ ఫ్యాన్స్ కి ‘రాజా సాబ్’ అలా అన్నమాట. ప్రతీ ఏడాది రెండు సినిమాలను తప్పకుండా విడుదల చేసే ప్రభాస్ నుండి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా వచ్చే అవకాశం లేదా?, హను రాఘవపూడి సినిమా వేగవంతంగా జరుగుతుంది కదా, ఈ సినిమా కూడా ఈ ఏడాది రాదా? అని ప్రభాస్ అభిమానులు మేకర్స్ ని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో అడుగుతున్నారు.
Also Read : స్టేజిపై త్రిష తో కమల్ హాసన్ అసభ్యకరమైన జోక్..ఈ వయస్సులో అవసరమా?