Prabhas
Prabhas : సెలబ్రిటీలపై అసత్య ప్రచారాలు చేయడం సోషల్ మీడియా లో ఈమధ్య కాలంలో సర్వసాధారణం అయిపోయింది. సెలబ్రిటీలు కూడా మన పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు, పోనీలే అని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. కానీ కొన్ని సందర్భాలలో హద్దులు మీరే వాళ్లకు మాత్రం చాలా సీరియస్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్(Rebel Star Prabhas) ఆరోగ్యం విషయం లో ఇటీవల సోషల్ మీడియా లో ఏ రేంజ్ ప్రచారాలు జరిగాయో మనమంతా చూసాము. ప్రభాస్ మెట్ల మీద నుండి జారీ పడిపోయాడని, అతనికి పెద్ద సర్జరీ జరిగిందని కొందరు, అదే విధంగా ఫైట్ సన్నివేశం చేస్తున్నప్పుడు ప్రభాస్ కాళ్లకు తీవ్రమైన దెబ్బలు తగిలాయి, అందుకే ఆయనకు విదేశాల్లో సర్జరీ జరిగిందని మరికొందరు, ఇలా ఎంతో మంది ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఇష్టమొచ్చినట్టు యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ పెట్టి అసత్య ప్రచారాలు చేస్తూ వచ్చారు.
Also Read : పెళ్లి పై మీడియాకు అధికారిక ప్రకటన చేసిన ప్రభాస్!
విషయం ప్రభాస్ PRO టీం వరకు వెళ్లడంతో, వాళ్ళు వెంటనే స్పందించి ప్రభాస్ కి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని, దయచేసి అభిమానులు కంగారు పడొద్దని, సోషల్ మీడియా లో వచ్చే అసత్య ప్రచారాలను అసలు నమ్మొద్దు అంటూ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసారు. అయినప్పటికీ ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడలేదు. అయితే హైదరాబాద్ లో నేడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేమిటంటే ప్రభాస్ PRO తనని బెదిరిస్తున్నాడు అంటూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ విజయ్ సాధు అనే యూట్యూబర్ ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మార్చి నాల్గవ తేదీన విజయ్ తన యూట్యూబ్ ఛానల్ లో ‘డార్లింగ్ ఇన్ డేంజర్’ అనే థంబ్ నైల్ ని పెట్టి, అతనికి ఒక పెద్ద సర్జరీ జరిగిందంటూ ఒక వీడియో ని చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ప్రభాస్ PRO వరకు ఈ వీడియో చేరడంతో, వెంటనే తొలగించమని బెదిరించారని, కానీ తాను తొలగించకపోవడంతో ఆ వీడియో ని ప్రభాస్ అభిమానులకు షేర్ చేయగా, వాళ్ళు కూడా బెదిరించడం మొదలు పెట్టారని, వీటి అన్నిటికి కారణం సురేష్ కొండేటి అని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసారు. అసత్య ప్రచారం చేయడమే పెద్ద తప్పు, అది కూడా ఆరోగ్యం పై, అది తొలగించండి అని వార్నింగ్ ఇచ్చినందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడమా?, ఇదెక్కటి విచిత్రం అంటూ సోషల్ మీడియా లో ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకొని విడుదలకు దగ్గరగా ఉన్న చిత్రం ‘రాజా సాబ్’. ఏప్రిల్ 10 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, సెప్టెంబర్ దాటినా వచ్చే సూచనలు కనిపించడం లేదు.
Also Read : ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురు తో ప్రభాస్ పెళ్లి ఫిక్స్..ట్విస్ట్ అదిరింది కదూ!