https://oktelugu.com/

Donald Trump : ఏప్రిల్‌ 2న ఏం జరుగుతుంది.. ట్రంప్‌ అన్నంత పని చేస్తాడా?

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) బాధ్యతలు చేపట్టాక.. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో అటు అమెరికన్లు.. ఇటు ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్‌ ప్రపంచ దేశాలను టారిఫ్‌ల పేరుతో భయపెడుతున్నారు.

Written By: , Updated On : March 31, 2025 / 01:17 PM IST
Donald Trump tariffs

Donald Trump tariffs

Follow us on

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. టారిఫ్‌ల పేరుతో ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. ఇప్పటికే మెక్సికో(Mexico), కెనడా(Canada), చైనా(China)పై 25 శాతం టారిఫ్‌లు విధించారు. ఏప్రిల్‌ 2 నుంచి అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపైనా టారిఫ్‌లు విధిస్తానని ప్రకటించారు. దీంతో అమెరికాతో సన్నిహితంగా ఉన్న దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు భారత్‌ విషయంలో మాత్రం అమెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 2న ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది.

Also Read : పుతిన్‌ కారు పేలుడు.. జెలన్‌స్కీ జోష్యం నిజం కాబోతోందా..!

భారత్‌పైనా సుంకాలు..
డొనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్‌ 2, 2025 నుంచి భారత్‌పై ప్రతీకార సుంకాలు (reciprocal tariffs) విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రకారం, భారత్‌ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధిస్తున్న సుంకాలకు సమానంగా, అమెరికా కూడా భారత్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదే స్థాయిలో సుంకాలు వసూలు చేయనుంది. ట్రంప్‌ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, భారత్‌ తమపై అధిక సుంకాలు (100–200% వరకు) విధిస్తుందని, దీనికి ప్రతిగా తాము కూడా అదే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే, భారత్‌ ఈ సుంకాలను గణనీయంగా తగ్గిస్తే, అమెరికా కూడా తమ వైఖరిని సవరించుకునే అవకాశం ఉందని ట్రంప్‌ సూచించారు. ఈ నిర్ణయం గ్లోబల్‌ వాణిజ్యంలో మార్పులను తీసుకురావచ్చని, భారత్‌–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఇలా..
భారత్‌ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే సుంకాలు (tariffs) వస్తువుల రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా, భారత్‌ అమెరికా నుంచి వచ్చే వస్తువులపై సగటున 10–20% సుంకాలు విధిస్తుంది, కానీ కొన్ని నిర్దిష్ట ఉత్పత్తులపై ఇది 100% లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది.

వ్యవసాయ ఉత్పత్తులు: అమెరికా నుంచి దిగుమతి అయ్యే బాదం, వాల్‌నట్స్, ఆపిల్‌ల వంటి వాటిపై భారత్‌ 30–100% వరకు సుంకాలు వసూలు చేస్తుంది.

పారిశ్రామిక వస్తువులు: మోటార్‌సైకిల్స్‌ (హార్లె డేవిడ్‌సన్‌ వంటివి) మరియు ఇతర వాహనాలపై 50–60% వరకు సుంకాలు ఉన్నాయి.

స్టీల్, అల్యూమినియం: 2018లో అమెరికా భారత్‌ స్టీల్, అల్యూమినియంపై సుంకాలు విధించిన తర్వాత, భారత్‌ ప్రతీకార చర్యగా అమెరికా నుంచి వచ్చే కొన్ని వస్తువులపై 10–50% అదనపు సుంకాలు విధించింది.

అమెరికాలో ఇలా..
అమెరికా విషయానికొస్తే, భారత్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సాధారణంగా తక్కువ స్థాయి సుంకాలు (0–5%) ఉంటాయి. ఎందుకంటే భారత్‌కు అమెరికా జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (GSP) ద్వారా కొన్ని సౌలభ్యాలు ఇచ్చేది. అయితే, 2019లో ట్రంప్‌ GSP స్థితిని భారత్‌కు రద్దు చేశారు, దీంతో కొన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాలు పెరిగాయి. ట్రంప్‌ ఏప్రిల్‌ 2, 2025 నుంచి భారత్‌పై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం, భారత్‌ అమెరికా వస్తువులపై విధించే అధిక సుంకాలకు సమానంగా, అమెరికా కూడా భారతీయ ఉత్పత్తులపై 100–200% వరకు సుంకాలు వసూలు చేయాలని ప్లాన్‌ చేస్తోంది.

Also Read : అనంతగిరిలో 500 ఏళ్ల తెలుగు శిలా శాసనం.. తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం