Prabhas: ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాల హవానే సాగుతోంది. ప్రభాస్ తో మొదలైన పాన్ ఇండియా స్టార్ మేనియా.. ఇప్పుడు త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్‌చరణ్, కేజీఎఫ్ తో యష్ అదే బాటలో నడుస్తున్నారు. వరుసగా త్రిబుల్ ఆర, కేజీఎఫ్-2 మూవీలు వచ్చి పెద్ద ఎత్తున రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో ప్రభాస్ కు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పోటీ వచ్చే అవకాశంఉందంటూ చర్చ సాగుతోంది. అయితే వీటన్నింటిపై డార్లింగ్ ప్రభాస్ స్పందించారు.
రీసెంట్ గా ఆయన ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా రామ్‌చరణ్, తారక్, యశ్‌లు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లుగా అవతరించడంతో వారితో మీకు పోటీ పెరిగిందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. అలాంటిదేం లేదంటూ చెప్పాడు ప్రభాస్.
Also Read: Devi Sri Prasad- Thaman: దేవీశ్రీ ప్రసాద్ ప్రభావం తగ్గిందా? తమన్ వైపే సినిమా పరిశ్రమ మొగ్గు
మరిన్ని పాన్ ఇండియన్ సినిమాలు రావాలని.. ఉత్తరాది, దక్షిణాది అనే బేధాలు లేకుండా అందరం కలిసి మరిన్ని పాన్ ఇండియా మూవీలు తీయాలని, అప్పుడే పరిశ్రమ బాగుంటుందని వెల్లడించారు. తనకు పోటీగా ఎవరినీ భావించనని అందరం కలిసి కట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఇక రీసెంట్ గా వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీపై కూడా స్పందించారు డార్లింగ్.
ఆర్ఆర్ఆర్ మూవీని చూశానని, బాగా నచ్చిందని చెప్పాడు. ఇండియాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన మూడో మూవీగా రికార్డు సృష్టించడం సంతోషంగా ఉందన్నాడు ప్రభాస్. ప్రస్తుతం రాజమౌళి దక్షిణాది డైరెక్టర్ కాదని.. ఇండియన్ డైరెక్టర్ గా అవతరించారంటూ ప్రశంసలు కురిపించాడు బాహుబలి. ఇక కేజీయఫ్-2 మంచి విజయంస సాధించడం సంతోషంగా ఉందన్నాడు.
ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ వివరించారు ప్రభాస్. ఇక కేజీఎఫ్-2 సక్సెస్ కావడంతో.. తనకు కూడా సలార్ తో ప్రశాంత్ నీల్ పెద్ద హిట్ ఇస్తారని ఆశిస్తున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ తీసుకున్న మంచి నిర్ణయం ఇదే అంటూ ఫ్యాన్స్ సంబురపడుతున్నారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి.
Also Read:RRR: RRR కి భారీ నష్టాలను మిగిలించిన ప్రాంతాలు ఇవే