https://oktelugu.com/

Devi Sri Prasad- Thaman: దేవీశ్రీ ప్రసాద్ ప్రభావం తగ్గిందా? తమన్ వైపే సినిమా పరిశ్రమ మొగ్గు

Devi Sri Prasad- Thaman: సినిమా పరిశ్రమలో దేవీశ్రీ ప్రసాద్ సంగీతమంటే అందరికి ఇష్టమే. తన సొగసైన బాణీలతో పాటలను ఉర్రూతలూగించడం తెలిసిందే. నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ వర్షంలో కూర్చిన బాణీలు తెలిసిందే. నిన్ను చూడగానే నా చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అంటూ తన గొంతుతో జిమ్మిక్కు సృష్టించారు. తెలుగు సినిమాల్లో దేవీశ్రీ సంగీతం ఓ రేంజ్ లో ఉంటుందని అందరికి సుపరిచితమే. బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి. ఇన్నాళ్లు తన సంగీతంతో అందరిని మెప్పించిన […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 16, 2022 / 12:38 PM IST
    Follow us on

    Devi Sri Prasad- Thaman: సినిమా పరిశ్రమలో దేవీశ్రీ ప్రసాద్ సంగీతమంటే అందరికి ఇష్టమే. తన సొగసైన బాణీలతో పాటలను ఉర్రూతలూగించడం తెలిసిందే. నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ వర్షంలో కూర్చిన బాణీలు తెలిసిందే. నిన్ను చూడగానే నా చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అంటూ తన గొంతుతో జిమ్మిక్కు సృష్టించారు. తెలుగు సినిమాల్లో దేవీశ్రీ సంగీతం ఓ రేంజ్ లో ఉంటుందని అందరికి సుపరిచితమే.

    Devi Sri Prasad- Thaman

    బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి. ఇన్నాళ్లు తన సంగీతంతో అందరిని మెప్పించిన దేవీశ్రీ ప్రసాద్ హవాకు ప్రస్తుతం గండి పడిందని తెలుస్తోంది. పదేళ్ల క్రితం వచ్చిన తమన్ సంగీతంలో దేవీకంటే ముందుంటున్నారు. దీంతో తమన్ కూడా మంచి బాణీలతో ప్రేక్షకులను అదరగొడుతున్నారు. ఇంత కాలం ప్రతి సినిమాలో దేవీశ్రీ సంగీతం ఉండాలని చూసుకునే వారు.

    Also Read: Vivek Agnihotri: ఈసారి ఢిల్లీ ఫైల్స్ తీస్తా.. సిక్కుల ఊచ‌కోత నేప‌థ్యంలో మూవీని ప్ర‌క‌టించిన అగ్నిహోత్రి..

    ప్రస్తుత పరిస్థితుల్లో తమన్ వేగంగా దూసుకుపోతున్నారు. ప్రతి సినిమాలో తనదైన బాణీలు కడుతూ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నారు. దీంతో అందరు తమన్ వైపే చూస్తున్నారు. ఇక దేవీశ్రీ పని అయిపోయిందనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న, పెద్ద అనే లేకుండా ఒకే తరహా సంగీతంతో మెప్పిస్తున్నారు. టాలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు.

    తెలుగు సినిమాల్లో ఇప్పుడు తమన్ వేగం పెరిగింది. దేవీశ్రీ మ్యాజిక్ తగ్గింది. దీంతో తమన్ కోసమే నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆయన స్వరాలతో అందరిని మెప్పిస్తున్నారు. అందుకే తమన్ సంగీతానికి ఫిదా అవుతున్నారు .దిల్ రాజు పెద్ద నిర్మాతలు కూడా దేవీశ్రీని కాదనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం దేవీశ్రీని కాదని తమన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

    Devi Sri Prasad- Thaman

    భవిష్యత్ లో దేవీశ్రీ ప్రసాద్ కు ఇంకా సినిమాలు తగ్గేలా ఉన్నాయి. తమన్ హవా రోజురోజుకు పెరుగుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ తమన్ సేవల కోసం ఎక్కువగా ఆధారపడుతోంది. పెద్ద హీరోల నుంచి చిన్న సినిమాల దాకా తమనే స్వరాలు సమకూరుస్తున్నారని చెబుతున్నారు.

    Also Read:KGF 2 2nd Day Collections: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కేజీఎఫ్-2.. రెండో రోజు కలెక్షన్లు చూస్తే మైండ్ బ్లాంక్..?

    Tags