https://oktelugu.com/

Rajasaab Glimpse: రాజా సాబ్ గ్లింప్స్ రివ్యూ: ఎన్నాళ్లకు మళ్ళీ ప్రభాస్ ఇలా, డార్లింగ్ ఏదో కొత్తగానే ట్రై చేస్తున్నాడు!

ఒకప్పటి ప్రభాస్ ని గుర్తు చేశాడు దర్శకుడు మారుతి. రాజా సాబ్ నుండి నేడు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంది. ఏళ్ల తర్వాత ప్రభాస్ సూపర్ హ్యాండ్సమ్ గా కనిపించారు. పనిలో పనిగా విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. రాజా సాబ్ గ్లింప్స్ లో ఏముందో చూద్దాం...

Written By:
  • S Reddy
  • , Updated On : July 29, 2024 / 07:22 PM IST
    Follow us on

    Rajasaab Glimpse : ప్రభాస్ కెరీర్ బిగినింగ్ లో యాక్షన్ సబ్జక్ట్స్ ఎంచుకున్నారు. ఛత్రపతి, యోగి వంటి చిత్రాలు ఆయనకు మాస్ ఆడియన్స్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. అరడుగు ప్రభాస్ ఫైట్ చేస్తుంటే చాలా రియలిస్టిక్ భావన కలుగుతుంది. ఆయన శరీర దారుఢ్యానికి రౌడీలు గాల్లో ఎగరేయడం చూసి ఆడియన్స్ కన్విన్స్ అవుతారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి దగ్గరైనప్పుడే స్టార్ హీరో అవుతామని భావించిన ప్రభాస్… రొమాంటిక్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా ఎంచుకున్నాడు.

    డార్లింగ్, పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. మహేష్ బాబుకి సమానంగా ప్రభాస్ కి లేడీ ఫాలోయింగ్ పెరిగింది. ఆ చిత్రాల్లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా ఉంటాడు. బాహుబలి వరకు ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉంది. సాహో మూవీలో ప్రభాస్ ని చూసి ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ప్రభాస్ ముఖంలో ఒకప్పటి గ్లో మిస్ అయ్యింది. రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ చిత్రాల్లో కూడా ప్రభాస్ లుక్ పరంగా ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు.

    కల్కి కథ, జోనర్ రీత్యా ప్రభాస్ ని అందంగా చూపించే ఛాన్స్ లేదు. హ్యాండ్సమ్, లవర్ బాయ్ గా ఫెయిర్ లుక్ లో ప్రభాస్ ని చూడాలన్న కోరికను దర్శకుడు మారుతి తీర్చాడు. నేడు విడుదలైన గ్లింప్స్ చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని ఆకాశానికి ఎత్తుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత అద్భుతంగా ప్రభాస్ ని ప్రజెంట్ చేశాడు మారుతి. గతంలో వరుస పరాజయాలు ఎదురవుతున్న క్రమంలో మారుతితో మూవీ చేయవద్దని ప్రభాస్ ఫ్యాన్స్ గోల చేశారు.

    ఇప్పుడు వారి అభిప్రాయం మారిపోయి ఉంటుంది. తిట్టిన నోళ్లు నేడు మారుతిని పొగుతాయి. ఇక రాజా సాబ్ గ్లింప్స్ గురించి చెప్పాలంటే… మనసులు దోచేసింది. ఫీల్ గుడ్ టీజర్ అని చెప్పవచ్చు. బైక్ పై వచ్చిన ప్రభాస్… అక్కడ ఆగి వున్న ఖరీదైన వింటేజ్ కారు అద్దంలో ఫేస్ చూసుకుంటాడు. తన అందానికి మురిసిపోయి చేతిలో ఉన్న బొకే లో పూలు కోసి అద్దం మీద చల్లుతాడు. ప్రభాస్ లుక్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఆయన.. స్పెషల్ పర్సన్ ని కలవడానికి వెళుతున్నాడు.

    మరి ప్రభాస్ ప్రేయసి ఎవరు అనేది చూడాలి. వింటేజ్ సెటప్ నేపథ్యంలో ఏదైనా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో కూడిన సినిమానా అనే సందేహాలు కలుగుతున్నాయి. గ్లింప్స్ లో జానర్ మీద క్లారిటీ ఇవ్వడం విశేషం. రాజా సాబ్ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం అట. సమ్మర్ కానుకగా 2025 ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.

    ప్రభాస్ ప్రస్తుత ఇమేజ్ రీత్యా హారర్ కామెడీ కథతో దర్శకుడు మారుతి ప్రేక్షకులను ఎలా కన్విన్స్ చేస్తాడు అనేది చూడాలి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మొత్తంగా ఫస్ట్ గ్లింప్స్ అంచనాలు పెంచేసింది.