https://oktelugu.com/

Prabhas London House : లండన్ లో ప్రభాస్ తీసుకున్న ఇల్లు ధర ఎంతో తెలుసా?

ఇటీవల ప్రభాస్ పలుమార్లు లండన్ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలుస్తున్న విషయమేంటంటే ప్రభాస్ లండన్ లో ఏకంగా ఓ ఇల్లును తీసుకున్నాడట.

Written By:
  • Srinivas
  • , Updated On : February 26, 2024 / 05:04 PM IST

    prabhas london house

    Follow us on

    Prabhas London House : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ పేరు చెబితే షేక్ అవుతుంది. బాహుబలి నుంచి ప్రభాస్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా లెవల్లో ఒక్కో సినిమా తీస్తుండడంతో ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. సినిమా షూటింగ్ లో భాగంగా ప్రభాస్ విదేశాలకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రభాస్ పలుమార్లు లండన్ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలుస్తున్న విషయమేంటంటే ప్రభాస్ లండన్ లో ఏకంగా ఓ ఇల్లును తీసుకున్నాడట. ప్రతీసారి లండన్ వెళ్లినప్పుడు ఆయన ఇందులో స్టే చేస్తాడట. ఇంతకీ ఆ ఇంటి కోసం ఎంత వెచ్చిస్తున్నాడో తెలుసా?

    టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల్లో మాత్రమే కనిపిస్తున్నాడు. చేతిలు పలు సినిమాలో తీరక లేకుండా ఉన్నారు. ఆయన నటించిన సలార్ ఇటీవల రిలీజ్ అయి మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. ప్రస్తుతం అదే సినిమా పార్ట్ 2లో నటిస్తున్నాడు వీటితో పాటు కల్కి, తదితర సినిమాలో నటిస్తున్నాడు. కొద్ది రోజులుగా ప్రభాస్ విదేశీ టూర్లలో బిజీ అయ్యాడు. ముఖ్యంగా ఆయన ఎక్కువగా లండన్ వెళ్లి వస్తున్నాడు.

    అయితే సినీ వర్గాల్లో ప్రభాస్ లండన్ ఎందుకు వెళ్లివస్తున్నాడని తీవ్రంగా చర్చించుకుంటున్నారు.సినిమా షూటింగ్ లతో పాటు మనసు ప్రశాంతంగా ఉండేందుకు ప్రభాస్ అప్పుడప్పుడు లండన్ వెళ్లి వస్తున్నారట. ఈ క్రమంలో ఆయన లండన్ వెళ్లిన ప్రతీసారి హోటల్ లో ఉండడం ఇబ్బందిగా మారిందట. అంతేకాకుండా ప్రభాస్ కు సౌకర్యవంతమైన హోటల్ లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారట.

    ఈ క్రమంలో ఆయన లండన్ లో ప్రత్యేకంగా ఓ ఇల్లును తీసుకున్నాడట. అయితే దీనిని కొనుగోలు చేయడం కాదు. రెంట్ కు తీసుకున్నాడట. అయతే దీనిని రెంట్ కు తీసుకున్నా.. రూ.20 లక్షలు చెల్లించాలట. అంటే లండన్ వెళ్లిన ప్రతీసారి ప్రభాస్ ఇక్కడే నివసిస్తాడట. ఇది పచ్చని చెట్ల మధ్య ఎంతో సౌకర్యవంతంగా ఉందని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రభాస్ కు హైదరాబాద్ సమీపంలోనూ ఓ ఫాం హౌస్ ఉన్న విషయం తెలిసిందే.