https://oktelugu.com/

రూ.23 లక్షల కారు రూ.11 లక్షలకే ఎక్కడో తెలుసా?

ఓ కారు కొత్తది కొనుగోలు చేస్తే రూ.23 లక్షలు. కానీ దీనిని కొంచెం వాడిన కారును సగం ధరకే సొంతం చేసుకోవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 26, 2024 / 05:01 PM IST

    second hand car

    Follow us on

    కారు కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుది. కానీ కనీసం రూ.5 లక్షలు లేనిదే 4 వీలర్ సొంతం కాదు. ఈ క్రమంలో కొంత మంది కొత్త కారు కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తారు. అలాగే చాలా మంది పెద్ద కారు కొనుగోలు చేయాలని అనుకుంటారు. కానీ బడ్జెట్ సరిపోదు. అయితే తక్కువ మైలేజ్ ప్రయాణించి, సగం ధరకే కొన్ని సంస్థలు కార్లను అందిస్తాయి. వీటిని కొనుగోలు చేసిన వారి కల నెరవేర్చుకోవచ్చు. తాజాగా ఓ కారు కొత్తది కొనుగోలు చేస్తే రూ.23 లక్షలు. కానీ దీనిని కొంచెం వాడిన కారును సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. లో బడ్జెట్ ఉండి ఎస్ యూవీ రేంజ్ లో కారు కావాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

    నిజామాబాద్ లోని మాదవనగర్ లో సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తున్నారు. ఇక్కడ ఏ కారు కావాలని అనుకున్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చని అంటున్నారు. ఎంపీ హెక్టర్ షార్ప్ కారు కావాలని ఎంతో మందికి కోరిక ఉంటుంది. కానీ దీనిని సొంతం చేసుకోవాలంటే రూ.23 లక్షలు చెల్లించాలి. అయితే ఈ బడ్జెట్ లేని వారు సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేయడం ద్వారా ఆ కారు అనుభూతిని పొందవచ్చు. దీనిని కేవలం రూ.11 లక్షలకే ఇక్కడ విక్రయిస్తున్నారు. 2019 మోడల్ కు చెందిన ఈ కారు ఇప్పటి వరకు 79 కిలోమీటర్ల మైలేజ్ తిరిగిందని అంటున్నారు.

    కొత్త కారు అనుభూతి కలిగేలా ఈ కారులో అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో సన్ రూప్, క్రుజ్ కంట్రోల్, కొత్త టైర్స్, మ్యాగ్ వీల్స్ ఆకర్షిస్తున్నాయి. ఇదేకాకుండా వివిధ రకాల సెకండ్ హ్యాండ్ వెహికిల్ అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. సెకండ్ హ్యాండ్ కారు కావాలనుకునేవారు తెలంగాణ కార్ప్ లో సెర్చ్ చేయడం ద్వారా అనుకున్న కారును పొందవచ్చని అంటున్నారు. అలాగే తెలంగాణలో మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చని అంటున్నారు.