Homeఎంటర్టైన్మెంట్Prabhas : మీరు వర్జినా?.. ఐ యామ్ నాట్.. ప్రభాస్ హీరోయిన్ దిమ్మ తిరిగే ఆన్సర్!...

Prabhas : మీరు వర్జినా?.. ఐ యామ్ నాట్.. ప్రభాస్ హీరోయిన్ దిమ్మ తిరిగే ఆన్సర్! ఏమైంది అంటే?

Prabhas : సోషల్ మీడియా సెలెబ్స్ ఉపయోగించాల్సిందే. ఫ్యాన్స్ కి టచ్ లో ఉండటం ద్వారా పాపులారిటీ, ఫేమ్ కొనసాగించడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే స్టార్స్ సైతం అప్పుడప్పుడు తమ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటిస్తారు. ఆన్లైన్ ఛాట్ లో వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతారు. హీరోయిన్ మాళవిక మోహనన్ సైతం తరచుగా చాట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె పాల్గొన్న సోషల్ మీడియా చాట్ లో ఒక నెటిజెన్ ప్రైవేట్ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు స్కిప్ చేయకుండా సమాధానం ఇచ్చి, అతడికి మాళవిక బుద్ది చెప్పింది.

Also Read : నాన్న అరటి పండ్లు అమ్మేవాడు, నేను ఆఫీస్ బాయ్… ప్రభాస్ డైరెక్టర్ మారుతి జీవితం తెలిస్తే గుండె బరువెక్కడం ఖాయం..

మీరు వర్జినేనా..? అని సదరు నెటిజన్ మాళవికను అడిగాడు. ‘ఇలాంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను'(To these kind of dirty questions i’m not) అని రిప్లై ఇచ్చింది. దాంతో అతని మైండ్ బ్లాక్ అయ్యింది. సోషల్ మీడియాలో ఇలాంటి వేధింపులు హీరోయిన్స్ కి సహజమే. హద్దులు దాటితే మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే. సోషల్ మీడియా వేధింపులు బాగా ఎక్కువయ్యాయి. కఠిన చట్టాలు తెచ్చినా అదుపు కావడం లేదు.

మాళవిక మోహనన్ తమిళ్ లో విజయ్ కి జంటగా మాస్టర్ చేసింది. ఆ మూవీలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అనూహ్యంగా ప్రభాస్ మూవీలో మాళవిక ఛాన్స్ కొట్టేసింది. ఇది ఆమెకు బడా ఆఫర్. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నాడు. నిధి అగర్వాల్, రిద్ది కుమార్ సైతం హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాజాసాబ్ మూవీలో మాళవిక ఫైట్స్ కూడా చేసింది. మార్కెట్ లో రౌడీలను చితక్కొడుతున్న వీడియో షూటింగ్స్ సెట్స్ నుండి లీకైంది.

రాజాసాబ్ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల కావాల్సింది. రాజాసాబ్ నిడివి ఎక్కువపోయిందట. లింక్స్ మిస్ కాకుండా నిడివి తగ్గించడం యూనిట్ కి ఛాలెంజ్ గా మారిందట. కనీసం 3 గంటల రన్ టైం కి కుదించడానికి కష్టపడుతున్నారని సమాచారం. మరోవైపు వచ్చే ఏడాదికి రాజాసాబ్ వాయిదాపడిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు. రాజాసాబ్ కామెడీ హారర్ డ్రామా అని ప్రచారం జరుగుతుంది. ఈ జోనర్ ప్రభాస్ కి ఎలా సెట్ అవుతుందనే అనుమానాలు ఉన్నాయి. ఆ మధ్య విడుదల చేసిన చిన్న టీజర్లో ఆయన లుక్ అదిరింది.

Also Read : కేవలం 9 నెలల్లో ప్రభాస్ ‘స్పిరిట్’..సందీప్ వంగ ప్లానింగ్ మామూలు రేంజ్ లో లేదుగా!

Exit mobile version