Kalki 2
Kalki 2 : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది డైరెక్టర్లు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. నాగ్ అశ్విన్ ‘మహానటి’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమా అందించిన విజయంతో ప్రభాస్ తో చేసిన ‘కల్కి’ సినిమా చేశాడు. ఈ మూవీ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించిందనే చెప్పాలి… అది చూసిన బాలీవుడ్ హీరోలు సైతం నాగ్ అశ్విన్ టాలెంట్ ను చూసి ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు….
ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ల హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న యంగ్ డైరెక్టర్లు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక కొత్త కథలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న దర్శకులు పాన్ ఇండియా లెవెల్లో సత్తాను చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి స్టార్ డైరెక్టర్ కల్కి సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్లాడు. మొత్తానికైతే ఈ సినిమా 1200 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడం తో నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఆ తర్వాత కల్కి 2 సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…ఇక ఇదిలా ఉంటే కల్కి సినిమాలో విలన్ గా కమల్ హాసన్ నటించాడు. ఇక కల్కి మొదటి పార్ట్ పెద్దగా ప్రభావం అయితే చూపించలేకపోయాడు. అమితాబచ్చన్ (Amithabachhan) చేసిన అశ్వద్ధమ పాత్ర మొదటి పార్టీకి హైలైట్ గా నిలిచింది. ఇక ఇదిలా ఉంటే ‘కల్కి 2’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. అయితే ‘కల్కి 2’ (Kalki 2) సినిమాలో కమల్ హాసన్ (Kamal Hasan) ప్రభాస్ (Prabhas) మధ్య యుద్ధం జరగదట. ఇక కమల్ హాసన్ కి కల్కి కి మధ్య యుద్ధం జరగబోతుంది. ఇంతకీ ఈ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ పాత్రలో ఒక స్టార్ హీరో నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మన స్టార్ హీరో ఎవరు అనేదానికి ఇంకా క్లారిటీ అయితే రాలేదు… మొదటి పార్ట్ గుర్తింపైతే రాలేదు. మరి సెకండ్ పార్ట్ లో కూడా ప్రభాస్ క్యారెక్టర్ అలాగే ఉంటుందా? లేదంటే మార్పులు చేర్పులు చేసి ఆ క్యారెక్టర్ ని భారీగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే కమల్ హాసన్ ను ఢీ కొట్టేది కల్కి పాత్రను పోషించే నటుడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆ నటుడు ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. కాబట్టి ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘కల్కి 2’ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది…