Mokshagna Teja: బాలయ్య బాబు కొడుకు అయినా మోక్షజ్ఞ ను హీరోగా పెట్టి ప్రశాంత్ వర్మ ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొదటి సినిమా కావడంతో మోక్షజ్ఞ కూడా ఈ సినిమా మీద చాలా ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నట్టుగా కూడా వార్తలైతే వచ్చాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత వర్మ మోక్షజ్ఞ కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయిందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటి అంటే రీసెంట్ గా మహేష్ బాబు మేనల్లుడు అయిన అశోక్ గల్లా హీరోగా వచ్చిన ‘దేవకి నందన వాసుదేవ ‘ సినిమాకి కథను అందించిన ప్రశాంత్ వర్మ ఆ సినిమాని సక్సెస్ గా నిలపలేకపోయాడు. దానివల్లే బాలయ్య బాబు కొంతవరకు ఆలోచించి మరొక అడుగు ముందుకు వేయాలని తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రశాంత్ వర్మ సినిమా ఆల్మోస్ట్ క్యాన్సల్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతోపాటుగా బాలయ్య బాబు ఇప్పుడు నాగ్ అశ్విన్ ను కాంటాక్ట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసిన ప్రభాస్ ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఇప్పుడప్పుడే ఫ్రీ అయ్యే ఆలోచనలో అయితే లేడు. దాదాపు సంవత్సర కాలం పాటు ప్రభాస్ బిజీగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సంవత్సరం కాలంలో బాలయ్య బాబు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తన కొడుకుని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీని నాగ్ అశ్విన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ డైరెక్టర్ బాలయ్య బాబు కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రశాంత్ వర్మ తో మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాని చేయించాలని బాలయ్య బాబు మొదటి నుంచి అనుకుంటున్నప్పటికి ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కి పెద్దగా మార్కెట్ అయితే లేదని భావిస్తున్నారట.
మరి దాని వల్లే మోక్షజ్ఞ సినిమాని కూడా నాగ్ అశ్విన్ చేతిలో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక చూడాలి మరి ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లలో మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేసే దర్శకుడు ఎవరు అనేది…