Rajinikanth-Allu Arjun : నేడు సూపర్ స్టార్ రజినీకాంత్ 74 వ పుట్టినరోజు సందర్భంగా ఎక్కడ చూసినా ఆయన గురించే వార్తలు కనిపిస్తున్నాయి. తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో సాధించిన విజయాలు, సృష్టించిన రికార్డ్స్, సంపాదించిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, చేసిన సోషల్ సర్వీస్ ఇలా ఎన్నో అంశాల గురించి మరోసారి గుర్తు చేసుకున్నారు అభిమానులు. అదే విధంగా ఆయన కెరీర్ లో మిస్ అయిన కొన్ని సినిమాల గురించి కూడా మాట్లాడుకున్నారు. వాటిలో అల్లు అర్జున్ తో చెయ్యాల్సిన ఒక మల్టీస్టార్రర్ చిత్రం ప్రస్తావన కూడా ఒకటి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పదేళ్ల క్రితం గీత ఆర్ట్స్ బ్యానర్ లో రజినీకాంత్ తో ఒక భారీ బడ్జెట్ సినిమా తియ్యాలని నిర్మాత అల్లు అరవింద్ అనుకున్నాడట. ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన వద్ద సామజిక స్పృహ ఉన్నటువంటి మంచి కమర్షియల్ సబ్జెక్టు ఉందనే విషయాన్ని తెలుసుకొని అతనితో ఈ ప్రాజెక్ట్ ని తన బ్యానర్ మీద చేయాల్సిందిగా లాక్ చేసాడట అల్లు అరవింద్.
ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక కీలక పాత్ర పోషించడానికి కూడా సిద్ధమైనట్టు అప్పట్లో ఒక వార్త తెగ ప్రచారం అయ్యింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. రజినీకాంత్ తన సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఇటు పక్క అల్లు అర్జున్ కెరీర్ కూడా లాక్ డౌన్ తర్వాత వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ పరం ఈయన రజినీకాంత్ కంటే ప్రస్తుతం పెద్ద హీరో. పదేళ్ల క్రితం అల్లు అర్జున్ ఇమేజి కి, ఇప్పటి అల్లు అర్జున్ ఇమేజి చాలా తేడా ఉంది. అప్పట్లో అల్లు అర్జున్ క్యారక్టర్ లో బలం కాస్త తగ్గినా ఏమి అనుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఆయన పెద్ద సూపర్ స్టార్. కాబట్టి అప్పట్లో అనుకున్న ఈ కథ ఇప్పుడు సెట్ అవ్వకపోవచ్చు.
కానీ భవిష్యత్తులో ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే వాటి రికార్డ్స్ ని అందుకోవడానికి కనీసం దశాబ్ద సమయం పడుతుందని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మల్టీ స్టార్రర్ చిత్రాలు సర్వ సాధారణం అయిపోయాయి. కాబట్టికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో గట్టిగా తల్చుకుంటే భవిష్యత్తులో కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోలో గా ఇద్దరికీ వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టేంత బాక్స్ ఆఫీస్ స్టామినా ఉంది కాబట్టి, ఇద్దరు కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ లో నటిస్తే బాక్స్ ఆఫీస్ లెక్కలు ఆకాశమే హద్దు అనే విధంగా ఉంటుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో కూలీ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు ఆయన ‘జైలర్ 2 ‘ లో నటించడానికి సిద్దమవుతున్నాడు.