https://oktelugu.com/

Allu Arjun: డైరెక్టర్ సుకుమార్ అసలు పేరు ఇదా..అందరి ముందు నోరు జారేసిన అల్లు అర్జున్..వైరల్ అవుతున్న వీడియో!

అల్లు అర్జున్ మరియు 'పుష్ప 2' మూవీ టీం హైదరాబాద్ లో ఒక థాంక్యూ మీట్ ని ఏర్పాటు చేసి, ఈ సినిమా సక్సెస్ కి కారణమైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు నార్త్ ఇండియా ఆడియన్స్ కి ధన్యవాదాలు తెలపడం కోసం మూవీ టీం ఢిల్లీ లో ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 12, 2024 / 07:07 PM IST

    Allu Arjun(1)

    Follow us on

    Allu Arjun: ఐకాన్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం ఇండియా లోనే ఫాస్టెస్ట్ వెయ్యి కోట్ల సినిమాగా నిల్చిన సంగతి తెలిసిందే. వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఫుల్ రన్ లోనే కొట్టడం కష్టమైన ఈరోజుల్లో, అల్లు అర్జున్ కేవలం మొదటి వారం లోనే కొల్లగొట్టడం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. తెలుగు లో మన హీరో సినిమా హిట్ అయితే కచ్చితంగా వసూళ్లు భారీ గానే వస్తాయి. కానీ హిందీ వెర్షన్ వసూళ్లు మన తెలుగు వెర్షన్ వసూళ్లను డామినేట్ చేయడం ఇంతకు ముందు ఎప్పుడైనా చూశామా?, కేవలం ‘పుష్ప 2’ విషయంలోనే ఈ అద్భుతాన్ని చూసాము. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి అద్భుతాన్ని చూస్తామో లేదో చెప్పలేము. అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి, అది పుష్ప కి మాత్రమే సాధ్యమైన అద్భుతం అని చెప్పొచ్చు. ఖాన్స్ వల్ల కూడా సాధ్యం కానీ ఎన్నో సంచలనాత్మక రికార్డ్స్ ని ఈ చిత్రం బాలీవుడ్ లో రిజిస్టర్ చేస్తుందంటే ఏ స్థాయి సెన్సేషన్ అనేది అర్థం చేసుకోవచ్చు.

    ఇటీవలే అల్లు అర్జున్ మరియు ‘పుష్ప 2’ మూవీ టీం హైదరాబాద్ లో ఒక థాంక్యూ మీట్ ని ఏర్పాటు చేసి, ఈ సినిమా సక్సెస్ కి కారణమైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు నార్త్ ఇండియా ఆడియన్స్ కి ధన్యవాదాలు తెలపడం కోసం మూవీ టీం ఢిల్లీ లో ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆయన ఫ్లో లో సుకుమార్ అసలు పేరు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణం బండి సుకుమార్ రెడ్డి. క్రెడిట్స్ మొత్తం ఆయనకే దక్కాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

    ఇది విన్న తర్వాత గోదావరి జిల్లాకు చెందిన సుకుమార్ కులం రెడ్డినా? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్స్ వేస్తున్నారు. సుకుమార్ అనేక సందర్భాల్లో తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అని చెప్పిన సంగతి మన అందరికీ తెలిసిందే. చిరంజీవి అంటే ఇష్టం లేని ఒక వర్గానికి చెందిన మీడియా, సుకుమార్ చిరంజీవి వర్గానికి చెందిన వాడు కాబట్టి, ఆయన అభిమాని అయ్యాడు అంటూ ప్రచారం చేయసాగాయి. కానీ ఈరోజు అసలు విషయాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్లంతా షాక్ లోకి వెళ్లారు. ఇప్పుడు ఉన్న యూత్ మొత్తం ఏ హీరో అభిమాని అయినా అయ్యుండొచ్చు, కానీ మన చిన్నతనం లో మెగాస్టార్ చిరంజీవి కి అభిమాని కాకుండా ఉండడం దాదాపుగా అసాధ్యమే. ఆ స్థాయిలో ఆయన ప్రభావం ఒక జనరేషన్ మీద ఉండేది. దానికి కులం రంగు పులుముతు కామెంట్స్ చేయడం కేవలం ఆ మీడియా కే చెందింది అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.