Prabhas and Dil Raju : సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఎవ్వరి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు. ఒక్క సినిమా సక్సెస్ అయితే టాప్ పొజిషన్ కి చేరుకోవచ్చు. అదే ఒక్క ఫ్లాప్ పడితే మాత్రం ప్రొడ్యూసర్లు ఉన్నదంతా అమ్మేసుకుని రోడ్డుమీదికి వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే సినిమా అనేది ఒక జూదం లాంటిది. ఎప్పుడు ఎవరిని ఏ స్థాయిలో నిలబెడుతుందో చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని అంటూ సినిమా మేధావులు సైతం ఇండస్ట్రీ గురించి అభివర్ణిస్తూ ఉంటారు….
ఒకప్పుడు దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఎదురుచూసేవారు. ఆయన సినిమాల్లో ఎలాంటి వల్గర్ కంటెంట్ లేకుండా కుటుంబ సమేతంగా ప్రేక్షకులందరు కలిసి కూర్చొని చూసే సినిమాలను చేసేవాడు. ఇక అలాంటి దిల్ రాజు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలను చేసి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడున్న కుర్ర హీరోలతో సైతం సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… అప్పట్లో ప్రభాస్ తో మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలను చేశాడు. మరి ఇప్పుడు ప్రభాస్(Prabhas) డేట్స్ కోసం ఆయన విపరీతంగా ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆయనకు డేట్స్ అయితే దొరకడం లేదట. కారణం ఏంటి అంటే ఇప్పటికే ప్రభాస్ వరుసగా నాలుగైదు సినిమాలకు కమిట్ అయి ఉన్నాడు.
Also Read : ప్రభాస్, చరణ్ లతో పాన్ వరల్డ్ చిత్రాలు ప్లాన్ చేస్తున్న దిల్ రాజు… దిమ్మతిరిగే అన్నౌన్స్మెంట్!
వివిధ ప్రొడ్యూసర్స్ తో సినిమాలను చేస్తూ తన మార్కెట్ ను విపరీతంగా పెంచుకునే ప్రయత్నంలో ప్రభాస్ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ప్రభాస్ తో ఐదారు వందల కోట్ల బడ్జెట్ ని కేటాయించి సినిమాలు చేసే కెపాసిటీ దిల్ రాజుకి ఉందా అనే ధోరణిలో కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.
ఇక రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిల్ రాజు ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో భారీగా నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరి ఇలాంటి సందర్భంలో ప్రభాస్ లాంటి స్టార్ హీరో డేట్స్ పట్టి మరోసారి తనతో సినిమాను చేసి భారీ విజయాన్ని అందుకొని స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఇప్పటి వరకు వచ్చిన కొన్ని నష్టాలను పూడ్చుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దిల్ రాజుకి ప్రభాస్ డేట్స్ అయితే ఇవ్వడం లేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది.
మరి ఫ్యూచర్ లో వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా వచ్చే అవకాశం ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ కి ప్రస్తుతం ప్రభాస్ లాంటి హీరో డేట్స్ దొరకపోవడం అనేది నిజంగా చాలా బాడ్ లక్ అనే చెప్పాలి. పర్సనల్ గా ప్రభాస్ కి దిల్ రాజు కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది…
Also Read : దిల్ రాజుకు మైత్రీ చెక్… సలార్ విషయంలో భారీ దెబ్బ