Gold Rate Today: ప్రస్తుతం బంగారం కొనాలనే ఆలోచన వస్తేనే వామ్మో అది మనతో కాని పని అంటుంటారు. ఒకప్పుడు బంగారం కొనాలంటే కాస్త రిస్క్ చేస్తే చాలు తీసుకోవచ్చు లే అనుకునే వారు ప్రజలు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన కూడా రావడం లేదు. కొండలు గుట్టలు దాటి ప్రయాణిస్తున్న బంగారం ధరను పట్టుకోవడం సామాన్యుల వంతు అవుతుందా? అయినా దీని ధర పెంచే వారికి కాస్తైనా కనికరం లేదబ్బ అంటూ తిట్టిపోస్తున్నారు సామాన్య ప్రజలు. మరి కాదా? ఒకప్పుడు బంగారం 15 వేల ఉంటేనే వామ్మో బంగారం ధర రూ. 15 వేలా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా లక్షకు చేరువలో ఉంది.
Also Read: కూర్చుంటే డబ్బులు రావాలా? ఈ 5 సింపుల్ ట్రిక్స్ తెలుసుకోండి!
పెద్ద మాయ జరిగి ఈ బంగారం ధర పడిపోవాలని కోరుకునే వారు చాలా మందే ఉన్నారు. మరి ఈ మాయ త్వరలోనే జరగబోతుంది అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఎందుకంటే రానున్న రోజుల్లో పసిడి పతనం మొదలవుతుందట. ఎవరిని ఏడిపించినా సరే వారి పతనం మొదలవ్వాల్సిందే కదా. మరి బంగారం కోసం ఎంత మంది ఏడుస్తున్నారు కదా. అందుకే కాబోలు ఈ బంగారం పతనం మొదలు అవుతుంది అంటున్నారు నిపుణులు. అయితే పసిడి పతనాన్ని అంచనా వేశారు usa అనలిస్ట్ జాన్ మిల్స్.
ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు $3080 గా ఉన్న ఔన్స్ పుత్తడి ఏకంగా $ 1820కు దిగి రాబోతుందట. అంటే మన దగ్గర ఈ రేటును పోల్చి చూస్తే 10 గ్రాముల బంగారం ధర రూ. 56 వేలు మాత్రమే ఉండబోతుందన్నమాట. దీనికి కూడా కారణం ఉందంటున్నారు నిపుణులు. సప్లై పెరగడం, డిమాండ్ తగ్గడం వల్ల ఈ ధర తగ్గుతుందట. ఇక మన హైదరాబాద్ లో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములకు ₹83,369, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు ₹90,689 గా ఉంది. మరి చూశారు గా. మొత్తం మీద బంగారం రేటు మాత్రం తగ్గుతుందట. మగువలు మీకు ఇష్టం ఉన్న ఆ బంగారాన్ని కొనడానికి సిద్ధం అవండి.
గురువారం నాడు బంగారం ధరలు రూ.91,423 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కానీ చివరి రోజు నాటికి రూ.258 తగ్గి రూ.90,470 వద్ద ముగిశాయి. ట్రేడింగ్ రూ.91,230 వద్ద ప్రారంభమైంది. అయితే అంతకుముందు రోజు రూ.90,728 వద్ద ముగిసింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు బంగారం ధర తగ్గుతూనే వస్తుంది. ప్రపంచ మార్కెట్లో కూడా, బంగారం ధరలు ఔన్సుకు $3,100 పైన ట్రేడవుతున్నాయి. మిల్స్ అంచనా ప్రకారం ధర ఔన్సుకు $1,820 వరకు తగ్గవచ్చు. ఇది ప్రస్తుత స్థాయిల నుంచి దాదాపు 40% తగ్గుదలను సూచిస్తుంది. ఈ అంచనా బంగారం నిజంగా ఇంత తక్కువగా పడిపోతుందా అనే చర్చను మార్కెట్లో లేవనెత్తింది.
అయితే మిల్స్ తన అంచనాను అనేక వాదనలతో సమర్థిస్తున్నారు. మొదటిది, ప్రపంచవ్యాప్తంగా బంగారం సరఫరా పెరిగింది. 2024 రెండవ త్రైమాసికంలో మైనింగ్ లాభాలు ఔన్సుకు $950కి చేరుకున్నాయి. ఇది 2012 తర్వాత అత్యధికం. ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఉత్పత్తి పెరిగింది. రీసైకిల్ చేసిన బంగారం సరఫరా కూడా పెరిగింది. ప్రపంచ బంగారు మండలి ప్రకారం, 2024 నాటికి ప్రపంచ బంగారు నిల్వలు 9% పెరిగి 2,16,265 టన్నులకు చేరుకుంటాయి. రెండవది, డిమాండ్ తగ్గుదల సంకేతాలు కనిపిస్తున్నాయి. గత సంవత్సరం, కేంద్ర బ్యాంకులు 1,045 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. కానీ ఇప్పుడు 71% కేంద్ర బ్యాంకులు తమ హోల్డింగ్‌లను తగ్గించుకోవాలని లేదా స్థిరంగా ఉంచుకోవాలని ఆలోచిస్తున్నాయి. మూడవది, మార్కెట్ సంతృప్తత ప్రమాదం ఉంది. 2024లో బంగారం రంగంలో విలీనాలు, కొనుగోళ్లు 32% పెరిగాయి. ఇది మార్కెట్ గరిష్ట స్థాయికి చేరుకుందని సూచిస్తుంది. అంతేకాకుండా, ఇటీవలి బంగారు ఇటిఎఫ్‌ల పెరుగుదల మునుపటి ధరల దిద్దుబాట్ల నమూనాను పోలి ఉంది.