Allu Arjun And Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. రాజమౌళి(Rajamouli), పూరి జగన్నాథ్(Puri Jagannadh), త్రివిక్రమ్ (Trivikram) లాంటి దర్శకులు గత కొద్ది సంవత్సరాల నుంచి స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతూ వస్తున్నారు. మరి వీళ్ళు చేసిన సినిమాలు వీళ్ళని ఉన్నత స్థానంలో నిలపడమే కాకుండా వీళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని కూడా ఏర్పాటు చేశాయి. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తుండడం వల్ల త్రివిక్రమ్ కొంతవరకు డీలాపడ్డట్టుగా తెలుస్తోంది. ఒకప్పుడు స్వయంవరం, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు లాంటి మంచి కథలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి అతడు, జల్సా, అత్తారింటికి దారేది, జులాయి లాంటి సినిమాలతో యావత్ తెలుగు ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేశాడు.
Also Read: ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్న దిల్ రాజు…కారణం ఏంటంటే..?
మరి ఇప్పుడు మాత్రం ఆయన సరైన సక్సెస్ ని సాధించలేకపోతున్నాడనే చెప్పాలి. గుంటూరు కారం సినిమాతో భారీగా డీలాపడ్డ ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాను పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక గొప్ప వైవిధ్యం అయితే చూపిస్తూ ఉంటాడు.
ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అల్లు అర్జున్ తో ఒక మైథాలజికల్ సినిమాను చేయాలని అనుకున్నాడు. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లి తో సినిమా చేస్తూ ఉండడంవల్ల ఇప్పుడు తను ధనుష్ తో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ధనుష్ ఇంతకుముందు ‘సార్’ (Sir) అనే సినిమా చేశారు. కాబట్టి అప్పటినుంచి త్రివిక్రమ్ కి ధనుష్ తో మంచి పరిచయమైతే ఉంది.
మరి ఆయనతో సినిమా చేసి భారీ విజయాన్ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటాడా లేదంటే తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేసే సినిమాలు పాన్ ఇండియాలో ఉన్న ప్రేక్షకులను అలరించాల్సిన అవసరం ఆయితే ఉంది.
Also Read: 64 ఏళ్ళ వయస్సులో లవ్ స్టోరీ చేయబోతున్న బాలకృష్ణ..డైరెక్టర్ ఎవరంటే!