Homeఎంటర్టైన్మెంట్Prabhas : ప్రభాస్ నిర్ణయం ఆ చిన్న హీరో కెరీర్ నే మార్చేసింది. ఏకంగా బ్లాక్...

Prabhas : ప్రభాస్ నిర్ణయం ఆ చిన్న హీరో కెరీర్ నే మార్చేసింది. ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడుగా!

Prabhas : చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. దర్శకులు, రచయితలు హీరోలను దృష్టిలో ఉంచుకుని సబ్జెక్టులు రాసుకుంటారు. అన్ని సార్లు వారు అనుకున్న హీరోలతో ఆ కథలు తెరపైకి వెళ్లకపోవచ్చు. అందుకు పలు కారణాలు ఉంటాయి. కథ నచ్చకో, డేట్స్ కుదరకో ఒకరు చేయాల్సిన సబ్జెక్టు మరొకరి చేతిలోకి వెళుతుంది. ఈ క్రమంలో కొన్ని బ్లాక్ బస్టర్స్ మిస్ అవుతాయి. అలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్, ఓ చిన్న హీరోకి లైఫ్ ఇచ్చింది. తెలుగులో భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

అదే నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ. కొరియాగ్రాఫర్ ప్రభుదేవా దర్శకుడిగా మారి చేసిన చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఈ మూవీలో సిద్ధార్థ్, త్రిష జంటగా నటించారు. లవ్ అండ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. హీరో శ్రీహరి ఓ కీలక రోల్ చేశాడు. లవ్, రొమాన్స్ తో పాటు కామెడీ కూడా ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. సునీల్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు అద్భుతమైన కామెడీ పండించారు. హీరో, హీరోయిన్ మధ్య కూడా రొమాంటిక్ కామెడీ సన్నివేశాలు ఉంటాయి.

Also Read : ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?

అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు హైలెట్ అని చెప్పాలి. ఒక ప్రేమ కథను గొప్పగా ప్రజెంట్ చేసి ప్రభుదేవా పెద్ద విజయం అందుకున్నాడు. ఈ సినిమా త్రిష, సిద్ధార్థ్ లకు తెలుగులో ఫేమ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా కోలీవుడ్ కి చెందిన సిద్ధార్థ్ లవర్ బాయ్ ఇమేజ్ తో సెటిల్ అయ్యాడు. 2005లో విడుదలైన నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ 9 భాషల్లో రీమేక్ అయ్యింది. నిర్మాతలకు ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది.

అయితే ఈ కథను మొదట ప్రభాస్ కి వినిపించాడట ప్రభుదేవా. ఆయనతో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చేయాలి అనుకున్నాడట. అప్పటికే మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఈ రొమాంటిక్ లవ్ కామెడీ డ్రామా మీద ఆసక్తి చూపలేదు. బహుశా తనకు ఈ సబ్జెక్టు సెట్ కాదని ఆయన భావించారేమో. ప్రభాస్ నిర్ణయం సిద్ధార్థ్ కెరీర్ ని మార్చేసింది. ఈ మూవీ అనంతరం బొమ్మరిల్లు రూపంలో సిద్ధార్థ్ మరో బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు. అయితే అనంతరం ఆయన నటించిన చిత్రాలు ఏవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యాడు.

Also Read : ప్రభాస్ తో సూపర్ మ్యాన్ సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసిన సుకుమార్…

RELATED ARTICLES

Most Popular