Prabhas Darling Re Release: టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మళ్లీ మొదలైంది. గడిచిన రెండు మూడేళ్ళుగా మన టాలీవుడ్ ని ఈ రీ రిలీజ్ సినిమాలు ఒక రేంజ్ లో శాసించాయి. ఒక విధంగా చెప్పాలంటే కొత్త సినిమాలను సైతం డామినేట్ చేసే రేంజ్ కి వెళ్లాయి. మధ్యలో కొత్త సినిమాల హవా నడవడంతో ఈ ట్రెండ్ కాస్త నెమ్మదించింది, ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. రీసెంట్ గా విడుదలైన ‘కాంచన’ చిత్రం రీ రిలీజ్ లో ఒక సెన్సేషన్ సృష్టించింది. దాదాపుగా 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక ఏప్రిల్ 8 న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘రేసు గుర్రం’ చిత్రం రీ రిలీజ్ కాబోతుంది. దీనిపైనా కూడా మంచి క్రేజ్ ఉంది.
Also Read: 27 కోట్లు పెట్టి కొంటే.. నిండా ముంచాడు.. పాపం ఆయన కష్టం పగవాడికి కూడా రావద్దు
ఇక ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ఆల్ టైం క్లాసిక్ చిత్రం ‘డార్లింగ్’ కి అయితే వేరే లెవెల్ క్రేజ్ ఉంది. యూత్ ఆడియన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో విడుదల అవుతుందా అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 23 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ అవుతోంది. యూత్ లో ఈ సినిమా పై మంచి క్రేజ్ ఉండడంతో, ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్న థర్డ్ పార్టీ వాళ్ళు భారీ రేట్ కి అమ్మేస్తున్నారు. కేవలం ఒక్క నైజాం ప్రాంతం లోనే ఈ సినిమాకు కోటి రూపాయలకు పైగా బిజినెస్ జరిగిందట. ఇది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా కోస్తాంధ్ర , రాయలసీమ , కర్ణాటక , చెన్నై మరియు ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి మరో కోటి 50 లక్షల రూపాయిల బిజినెస్ జరిగిందట.
ఓవరాల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 5 కోట్ల రూపాయిల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. చాలా పెద్ద టార్గెట్ , కానీ మంచి రిలీజ్ ఇస్తే మాత్రం ఈ చిత్రం మొదటి రోజే ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టి నమ్మకం తో ఉన్నారు. కేవలం ఓపెనింగ్స్ మాత్రమే కాదు, ఈ చిత్రానికి లాంగ్ రన్ కూడా కచ్చితంగా ఉంటుందనే ఆశతో ఉన్నారు ఫ్యాన్స్. ఎందుకంటే కొత్త సినిమాలేవీ లేవు, ఏప్రిల్ 30న విడుదల అవుతుందని అనుకున్న ‘పెద్ది’ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే కనుక జరిగితే కచ్చితంగా ‘డార్లింగ్’ చిత్రానికి భారీ లాంగ్ రన్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
