Suryakumar Yadav Dance Video: టీమిండియా టి20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ల జాబితాలో ఇటీవల సూర్య కుమార్ యాదవ్ చేరిపోయాడు. 2007లో మహేంద్రసింగ్ ధోని.. 2024లో రోహిత్ శర్మ.. 2026లో సూర్య కుమార్ యాదవ్ టీమిడియాకు టి20 వరల్డ్ కప్ లు అందించారు. టి20 హిస్టరీలో సూర్య కుమార్ యాదవ్ కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు అద్భుతంగా ఆడుతాడు. బ్యాటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. గత ఏడాది సరైన ఫామ్ లో లేకపోయినప్పటికీ.. సూర్య కుమార్ యాదవ్ 2026 లో మాత్రం దుమ్మురేపాడు. టి20 వరల్డ్ కప్ లో జట్టును తన మార్గదర్శకంలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడు.
Also Read: 27 కోట్లు పెట్టి కొంటే.. నిండా ముంచాడు.. పాపం ఆయన కష్టం పగవాడికి కూడా రావద్దు
సూర్య కుమార్ యాదవ్ టి20 లో టీమ్ ఇండియాకు సారధిగా ఉన్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టులో ఆడుతున్నాడు. సూర్య కుమార్ యాదవ్ గత ఏడాది తిరుగులేని ఫాం కనబరిచాడు. ముంబై ఇండియన్స్ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే గత ఏడాది ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. ట్రోఫీ పోరులో చతికిల పడింది. దీంతో సూర్య కుమార్ యాదవ్ పడిన శ్రమ మొత్తం వృధా అయ్యింది.
ఈ సీజన్ లో సూర్య కుమార్ యాదవ్ తొలి మ్యాచ్ లో అంతగా ఆకట్టుకోలేదు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో తన స్థాయి ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు. అయినప్పటికీ అతని మీద ముంబై ఇండియన్స్ యాజమాన్యం గట్టి నమ్మకం పెట్టుకుంది. అతడు స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడతాడని భావిస్తోంది.. సూర్య కుమార్ యాదవ్ ఇటీవల ముంబైలో జరిగిన ఓ వేడుకల కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో అతడు స్టేజి మీద సందడి చేశాడు. అతడు వేదిక మీదకి వస్తుండగా దురంధర్ సినిమాలో పాట ప్లే చేశారు. ఆ పాటకు తగ్గట్టుగానే సూర్య కుమార్ యాదవ్ స్టెప్పులు వేశాడు. దీంతో వచ్చిన అభిమానులు మొత్తం ఈలలు, గోలలు చేస్తూ సూర్య కుమార్ యాదవ్ ను ఉత్సాహపరిచారు.
సూర్య కుమార్ యాదవ్ అచ్చం దురంధర్ సినిమాలో రణ్ వీర్ సింగ్ మాదిరిగా ఉన్నాడని అభిమానులు వ్యాఖ్యానించారు. గడ్డం, జుట్టు పెంచుకొని ఉండి ఉంటే సూర్య కుమార్ యాదవ్ అచ్చం హీరో మాదిరిగా ఉంటాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐపీఎల్ లో ముంబై జట్టుకు అతడు కొండంత అండ అని.. అతడు గనుక దుమ్ము దులిపే ఇన్నింగ్స్ ఆడితే తిరుగుండదని సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
DHRUNDHAR MODE FOR T20 WORLD CUP WINNING CAPTAIN….!!! pic.twitter.com/hb2BYHEgX1
— Johns. (@CricCrazyJohns) April 2, 2026
