Prabhas Coolie Movie Look: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు (Lokesh Kanakaraju) ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రస్తుతం రజనీకాంత్ (Rajinikanth) ను హీరోగా పెట్టి ఆయన చేస్తున్న కూలీ (Cooli) సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాలో ఇప్పటికే నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర (Upendra), సత్యరాజ్ (Sathya Raj) లాంటి నటులు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కూలీ సినిమా చివర్లో ప్రభాస్ కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి విక్రమ్ (Vikram) సినిమాలో రోలెక్స్ (Rolex) క్యారెక్టర్ లో సూర్య (Surya) ఎలాగైతే గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడో కూలీ (Cooli) సినిమాలో కూడా ప్రభాస్ ఒక అద్భుతమైన పాత్రలో నటించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక సినిమా ఎండింగ్ లో ఆయన పాత్ర ఉండబోతుందట.
లోకేష్ కనకరాజు తన తదుపరి సినిమాల్లో ప్రభాస్ ని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశ్యం తో రీసెంట్ గా అతనికి ఒక కథను కూడా వినిపించాడు అనే వార్తలైతే వచ్చాయి. ఇక అందులో భాగంగానే కూలీ సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ ను ఇన్వాల్వ్ చేసి లోకేష్ యూనివర్స్ లో భాగం చేయడమే కాకుండా ఆ తర్వాత ఆయన మీద ఒక సపరేట్ సినిమాని కూడా తీయాలనే ఉద్దేశ్యంతో లోకేష్ ఉన్నట్టుగా తమిళ్ మీడియాలో కొన్ని వార్తలైతే వచ్చాయి.
మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కూలీ సినిమాలో ప్రభాస్ నటిస్తే థియేటర్లు తగలడిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులను సైతం క్రియేట్ చేస్తుందనేది పక్క…ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
రజినీకాంత్ అభిమానులు సైతం ప్రభాస్ ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అయితే కూలీ మూవీ నుంచి ప్రభాస్ కూలీ బ్యాడ్జ్ పట్టుకున్న పిక్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అనేది నిజం అంటూ నమ్ముతున్నారు. అయితే ఈ పిక్ ఒక ఫ్యాన్ మేడ్ పిక్ అని ఇందులో ప్రభాస్ నటిస్తున్నాడా? లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని సినిమా యూనిట్ నుంచి కొంత మంది కొన్ని వివరణలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు…