Trivikram , Prabhas
Trivikram and Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియాలో వాళ్ళ మార్కెట్ ను పదిలంగా ఉంచుకోవడానికి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలతో సక్సెస్ సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. మొదట రైటర్ గా తన కెరీయర్ ను మొదలుపెట్టినప్పటికి ఆ తర్వాత డైరెక్టర్ గా మారి భారీ విజయాలను అందుకుంటు తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలను చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రభాస్(Prabhas) తో మాత్రం సినిమా చేయలేకపోయాడు. కారణం ఏదైనా కూడా ఆయన ఒకానొక సందర్భంలో ప్రభాస్ కి ఒక మంచి కథను కూడా వినిపించారట. కానీ ఆ సమయంలో ప్రభాస్ బాహుబలి సినిమాకి స్టిక్కయి ఉండడం వల్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆ సినిమా చేయలేకపోయాడనే వార్తలైతే వినిపిస్తూ ఉంటాయి.
ఇక ప్రభాస్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రావాలని చాలామంది కోరుకుంటున్నారు. వీళ్లిద్దరికి సపరేట్ స్టైల్ ఉంది. కాబట్టి వీళ్ళు ఎవరి స్టైల్ లోకి ఎవరు వచ్చి సినిమా చేస్తారు తద్వారా సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాకపోవడం అటు ప్రభాస్ అభిమానులను త్రివిక్రమ్ అభిమానులు చాలా వరకు నిరాశపరిచింది.
ఇద్దరు కూడా పాన్ ఇండియా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాబట్ట వీళ్ళ కాంబినేషన్ కి ఉన్న హైప్ ద్వారా ఫ్యూచర్ లో వీళ్ళ కాంబో లో ఒక భారీ సినిమా వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాకపోవడం వల్ల ఆయనలోని కామెడీ యాంగిల్ మరోసారి బయటికి తీసే దర్శకులైతే తగలేదని చెప్పాలి.
బుజ్జిగాడు సినిమాతో పూరి జగన్నాధ్ ప్రభాస్ లో ఉన్న డిఫరెంట్ బాడి లాంగ్వేజ్ ను బయటకు తీయడమే కాకుండా అందులో ఒక డిఫరెంట్ కామెడీ ని కూడా పెట్టి ప్రభాస్ చేత చాలా బాగా నటింపజేశాడు. మరి అలాంటి క్యారెక్టర్ ను మళ్లీ ప్రభాస్ పోషించాలంటే మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో అయితేనే అది సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు… ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుంది ఒకవేళ వచ్చిన ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మనం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…