https://oktelugu.com/

Prabhas : ఆ సీనియర్ హీరో ప్రభాస్ కి ఎలా బావ అయ్యాడు? ఇంట్రెస్టింగ్ స్టోరీ

ఓ సీనియర్ హీరోని ప్రభాస్ బావ అని పిలుస్తాడట. వారి మధ్య బంధుత్వం ఏమైనా ఉందా? ఆ నటుడు ప్రభాస్ కి బావ ఎలా అయ్యాడు. దీనికి వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేమిటో చూద్దాం.

Written By:
  • S Reddy
  • , Updated On : October 28, 2024 / 11:30 AM IST

    Pabhas-Mohan babu

    Follow us on

    Prabhas : ప్రభాస్ టాలీవుడ్ బడా హీరో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం ఆయన సొంతం. ప్రభాస్ కి డార్లింగ్ అనేది ఊత పదం. తన సన్నిహితులను ఆయన అలానే పిలుస్తారు. ప్రభాస్ భోజన ప్రియుడు. అలాగే భోళా శంకరుడు. దానధర్మాలు చేయడంలో ముందుంటారు. కరోనా సమయంలో ప్రభాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. ప్రభాస్ అందరు హీరోలకంటే ఎక్కువ డొనేట్ చేశాడు. ఇక తనతో పని చేసే నటులకు అరుదైన నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ తో విందు ఏర్పాటు చేయడం ఆయనకున్న అలవాటు.

    ప్రభాస్ ఒక చెఫ్ టీమ్ నే మైంటైన్ చేస్తాడట. వారు ప్రభాస్ కి కావలసిన రకరకాల నాన్ వెజ్ వంటకాలు వండి పెడతారట. తన సినిమాలకు పని చేసే ప్రతి ఒక్కరు మంచి భోజనం తినేలా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటారట. ఇక పరిశ్రమలో ప్రభాస్ కి చాలా మంది మిత్రులు ఉన్నారు. వారిలో మోహన్ బాబు ఒకరు. మోహన్ బాబును ప్రభాస్ బావా అని పిలుస్తాడట. తండ్రి వయసున్న వ్యక్తిని ప్రభాస్ బావా అని పిలవడం ఏమిటీ? దీనికి వెనుక ఓ ఆసక్తికర విషయం ఉంది.

    ప్రభాస్-మోహన్ బాబు కాంబోలో బుజ్జిగాడు మూవీ తెరకెక్కింది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన బుజ్జిగాడు ఓ మోస్తరు విజయం అందుకుంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్. మోహన్ బాబు చెల్లెలు పాత్ర చేసింది త్రిష. తాను ప్రేమిస్తున్న త్రిషకు గ్యాంగ్ స్టర్ అయిన మోహన్ బాబు అన్న అని ప్రభాస్ తెలుసుకుంటాడు. అప్పటి నుండి బావ అనిపిలుస్తాడు. కేవలం సినిమాలో పాత్ర కోసం మోహన్ బాబును ప్రభాస్ బావ అనేవాడట.

    అయితే సినిమా పూర్తి అయ్యాక కూడా ఆయన్ని ప్రభాస్ బావ అని సంబోధిస్తాడట. ఈ విషయాన్ని మంచు లక్ష్మి ఓ సందర్భంలో వెల్లడించింది. ఎప్పుడైనా ప్రభాస్ మోహన్ బాబును కలిస్తే బావ అని పిలుస్తాడట. మోహన్ బాబు సైతం ఆ పిలుపును ఎంజాయ్ చేస్తాడట. ఆ చనువుతోనే ప్రభాస్ ఆయనకు గొప్ప సహాయం చేశాడు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రంలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. అది ఆ సినిమాకు భారీ ప్రచారం తెచ్చిపెట్టింది. అదన్నమాట సంగతి. రానా, రామ్ చరణ్, గోపీచంద్ వంటి నటులు ప్రభాస్ కి అత్యంత సన్నిహితులు.