https://oktelugu.com/

Tirupati: తిరుపతికి వరుస బాంబు బెదిరింపులు..అసలేం జరుగుతోంది

సాధారణంగా బాంబు బెదిరింపు అనేది సంఘ విద్రోహ శక్తుల నుంచి వస్తుంది. ఆ సమయంలో భయానక వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి తిరుపతిలో ఉన్న శ్రీవారి భక్తులకు ఎదురవుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : October 28, 2024 11:14 am
    Tirupati

    Tirupati

    Follow us on

    Tirupati: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా విదేశీ భక్తులు బస చేసే హోటళ్లను టార్గెట్ చేస్తున్నారు.బెదిరింపులకు దిగుతున్నారు. ఆదివారం ఏకంగా కార్పొరేట్ హోటల్ తో పాటు వరాహస్వామి ఆలయం, ఇస్కాన్ ఆలయాల్లో బాంబులు పెట్టినట్లు ఈ మెయిల్స్ వచ్చాయి.దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాంబు డిస్పాజిబుల్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే ఎక్కడ కూడా బాంబులు చిక్కలేదని తెలుస్తోంది. తిరుపతి ఇస్కాన్ ఆలయంలో బాంబు బెదిరింపు మెయిల్ అందడంతో డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు విస్తృతంగా సోదాలు చేశాయి. అయితే ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇటీవల తిరుమలలో ఈ బెదిరింపు మెయిల్స్ సర్వసాధారణం అయ్యాయి. అక్టోబర్ 7న తిరుపతిలోని నాలుగు కార్పొరేట్ హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. తాజాగా మరోసారి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.ఆధ్యాత్మిక నగరంలో అలజడి సృష్టించేందుకేనని అనుమానిస్తున్నారు.

    * అధికారుల ఉరుకులు, పరుగులు
    తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఉరుకులు పరుగులు పెట్టారు. తిరుపతి విమానాశ్రయానికి అయితే ఏకంగా మూడుసార్లు బెదిరింపులు వచ్చాయి. స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని పేల్చివేస్తామని ఈ నెల నాలుగున ఒక మెయిల్ అందింది. 22న అదే సంస్థకు మరోసారి బెదిరింపు వచ్చింది. ఈ నెల 24న సైతం ఎయిర్లైన్స్, ఇండిగో విమానాలను పేల్చేస్తామంటూ ఎక్స్ వేదికగా బెదిరించారు ఆగంతకులు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కోల్కత్తా కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

    * భక్తుల భయాందోళనలు
    అయితే తిరుపతిలో తరచూ ఈ బెదిరింపులు వస్తుండడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. స్వామివారిని దర్శించుకుంటారు.భక్తుల జాబితాలో విఐపి లు,ప్రముఖులు సైతం ఉంటారు. అటువంటివారు హోటళ్లలో బస చేస్తారు.ఇప్పుడు అదే హోటళ్లకు బెదిరింపులు వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా విదేశీ భక్తులను టార్గెట్ చేస్తుండడంతో రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.