Mohammed Shami: క్రికెట్లో ఆట తీరు మాత్రమే కాదు అప్పుడప్పుడు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం ఆవగింజ వంతైనా లేకపోతే జట్టులో స్థిరమైన అవకాశం లభించడం చాలా కష్టం. ప్రపంచంలో మిగతా క్రికెట్ జట్లతో పోల్చి చూస్తే.. భారత జట్టులో విపరీతమైన పోటీ ఉంటుంది. ఒక్కో స్థానం కోసం చాలామంది ఆటగాళ్లు పోటీ పడుతుంటారు. అయినప్పటికీ అవకాశం లభించడం ఒకింత కష్టమే. వచ్చిన అవకాశాన్ని స్థిరంగా నిలబెట్టుకోవడం మరింత కష్టం.
టీమిండియాలో ఎంతోమంది బౌలర్లు ఉన్నారు. బ్యాటర్లతో పోల్చుకుని చూస్తే బౌలర్లకు స్థిరమైన కెరియర్ ఉండదు. గాయాలు ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని సందర్భాలలో అనారోగ్య సమస్యలు కూడా కెరియర్ సాఫీగా సాగకుండా చేస్తుంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ప్లేయర్లలో మహమ్మద్ షమీ యువకుడు. వేధిస్తున్న గాయాలతో పాటు వ్యక్తిగత జీవితం కూడా మహమ్మద్ షమీ కెరియర్ మొత్తాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఈ క్రమంలో అతడు అన్నిటిని తట్టుకొని బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా వచ్చాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో అదరగొట్టాడు. అంతా బాగుంటుందనుకుంటున్న క్రమంలో అతని పాదానికి గాయమైంది. దీంతో లండన్ లో అతడు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో క్రికెట్ కు దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. అలా చూస్తుండగానే సంవత్సరాలు గడిచిపోయాయి. టీమిండియా 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత టెస్ట్, టి20, వన్డే ఫార్మేట్ లలో ఆడింది. టి20 వరల్డ్ కప్ సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకుంది. ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కూడా ఆడింది. దానికంటే ముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడింది. ఇన్ని జరిగినప్పటికీ షమీకి జాతీయ జట్టులోకి పిలుపు రాలేదు. ఐపీఎల్ లో షమీ హైదరాబాద్ జట్టు తరఫున ఆడాడు. కానీ ఆశించిన స్థాయిలో వికెట్లు అందుకోలేకపోయాడు.. అందువల్లే అతడికి జాతీయ జట్టులో సెలెక్టర్లు చోటు కల్పించలేదని తెలుస్తోంది.
దేశవాళి క్రికెట్లో ఆకట్టుకుంటేనే ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు ఉంటుందని ఇటీవల మేనేజ్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. మహమ్మద్ షమీ డొమెస్టిక్ క్రికెట్ ఆట మొదలు పెట్టాడు. ఇందులో భాగంగానే రంజి ట్రోఫీ అతడు ఆడుతున్నాడు. ఉత్తరాఖండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో అతడు బెంగాల్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఉత్తరాఖండ్ జట్టు తో జరిగిన మ్యాచ్లో అతడు ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో బెంగాల్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. షమీ నానా ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అయితే శారీరక సామర్థ్యం సరిగా లేకపోవడంతో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కు అతడు దూరం పెట్టినట్టు తెలుస్తోంది. పై వ్యాఖ్యలను సెలెక్టర్లు చేయడంతో మహమ్మద్ షమీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇదే తీరుగా అతడు బౌలింగ్ చేస్తే జాతీయ జట్టులోకి ప్రవేశించే అవకాశం లేకపోలేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.