విప్లవాల పురటిగొడ్డ నుంచి వీర వనిత.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరో సంచలన డిమాండ్ తో దేశ రాజకీయాల్లో కలకలం సృష్టించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్ కతాలో 6 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్టీయే సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
Also Read: సుప్రీంకోర్టే ఇక కీరోల్.. ఏపీలో ఎన్నికలు ఏం కానున్నాయి?
సువిశాల భారతదేశాన్ని పాలించాలంటే నాలుగు రాజధానులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బ్రిటీష్ వారు కోల్ కతా నుంచే మొత్తం దేశాన్ని పాలించారని.. ఇప్పుడు ఒకే రాజధాని ఎందుకని.. సువిశాల భారతదేశానికి ఉత్తరం దక్షిణ, తూర్పు, పడమర దిశల్లో నాలుగు రాజధానులు ఎందుకు ఉండకూడదని మమతా బెనర్జీ ప్రశ్నించారు.
రోటేషన్ పద్ధతిలో దేశంలో నాలుగు రాజధానులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని.. ఇకనైనా మన ఆలోచనాధోరణి మారాలని మమత హితవు పలికారు. ఒకే దేశం ఒకే విధానం వద్దని.. ఎంపీలంతా నాలుగు రాజధానుల డిమాండ్ ను లేవనెత్తాలని మమత పిలుపునిచ్చారు.
Also Read: అంపశయ్యపై మరో కురువృద్ధ నేత
ఎన్నికల సమయంలోనే బీజేపీకి నేతాజీ గుర్తుకు వస్తారని.. ఆయన పోర్టును సైతం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ డాక్ గా మార్చారని మమత విమర్శించారు.
బెంగాల్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు నేతాజీని ఓన్ చేసుకోవడానికి అటు బీజేపీ, ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రెండూ తమ వంతుగా రాజకీయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నేతాజీ జయంతి వేళ కోల్ కతాలో వేడి రగులుకుంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్