https://oktelugu.com/

ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ అప్పుడే మొదలెట్టారు.. !

టాలీవుడ్‌ యంగ్‌ రెబర్ స్టార్ ప్రభాస్‌ ఇప్పుడు గ్లోబల్ స్టార్. బాహుబలి సూపర్ హిట్‌ తర్వాత అతని స్టార్డమ్‌ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. మన డార్లింగ్‌ సినిమాల కోసం ఇప్పుడు దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్‌కు ఎంతో మంది అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. బాహుబలి 1,2 తర్వాత అతను చేసిన ‘సాహో’ తెలుగులో అంతగా ఆడకపోయినా.. హిందీలో మంచి మార్కులు కొట్టేసింది. ఫారిన్‌లో కూడా ఆ మూవీకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇంతటి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 17, 2020 / 03:45 PM IST
    Follow us on

    టాలీవుడ్‌ యంగ్‌ రెబర్ స్టార్ ప్రభాస్‌ ఇప్పుడు గ్లోబల్ స్టార్. బాహుబలి సూపర్ హిట్‌ తర్వాత అతని స్టార్డమ్‌ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. మన డార్లింగ్‌ సినిమాల కోసం ఇప్పుడు దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్‌కు ఎంతో మంది అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. బాహుబలి 1,2 తర్వాత అతను చేసిన ‘సాహో’ తెలుగులో అంతగా ఆడకపోయినా.. హిందీలో మంచి మార్కులు కొట్టేసింది. ఫారిన్‌లో కూడా ఆ మూవీకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇంతటి ఫాలోయింగ్‌ ఉండడంతో  ప్రభాస్‌తో  సినిమా తీసేందుకు దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఎంత ఖర్చైనా పెట్టేందుకు రెడీ అవుతున్నారు. రెబల్‌ స్టార్ విస్తృత మార్కెట్‌ దృష్ట్యా ఎంత పెట్టుబడి పెట్టినా డబుల్‌ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ బడా నిర్మాత అశ్వినీ దత్‌.. డార్లింగ్‌తో  ఓ భారీ బడ్జెట్‌ మూవీ ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై రానున్న ఈ చిత్రానికి ఆయన అల్లుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే  కథ, స్ర్కిప్టు పనులు పూర్తవడంతో ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

    ‘మహానటి’తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నాగ్.. ప్రభాస్‌ కోసం ఓ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాను సిద్ధం చేశారు. ఈ మూవీలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ దీపిక పడుకోన్‌ నటించనుంది. ఆమె కోసం ఏకంగా రూ. 25 కోట్లు, ప్రభాస్‌కు వంద కోట్ల పారితోషికం ఇచ్చారట అశ్వినీదత్‌.  ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం ప్రభాస్‌ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్టు తాజా సమాచారం. ప్రభాస్, నాగ్‌ అశ్విన్‌ తరచూ వర్క్‌షాప్స్‌లో పాల్గొంటున్నారట. ఈ మూవీలో ప్రభాస్‌ క్యారెక్టర్, ఆ పాత్ర డైలాగ్స్‌ భిన్నంగా ఉంటాయని టాక్‌. అందుకోసం డార్లింగ్‌ ఇప్పటి నుంచే డైలాగ్‌ మాడ్యులేషన్‌పై దృష్టి పెట్టాడని టాక్. తొందర్లోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం  ఉంది.

    కాగా,  ప్రభాస్‌ ప్రస్తుతం రాధేశ్యామ్‌ మూవీలో నటిస్తున్నాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్‌ మూవీ పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని టాక్. హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే  రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ మధ్యే చిత్రం ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేయగా భారీ స్పందన వచ్చింది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్‌ను తొందర్లోనే తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. ఇది పూర్తయితే నాగ్‌ అశ్విన్‌ మూవీపైనే ప్రభాస్‌ పూర్తిగా దృష్టి పెట్టనున్నాడు.