సురేష్ రైనా రిటైర్మెంట్లో ‘లాజిక్’ ఇదేనా?

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెల్సిందే. అంతర్జాతీయ క్రికెట్ కు నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ధోని ఇన్ స్ట్రాగ్రాములో పోస్టు చేసిన ఐదు నిమిషాల్లోనే ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించి అందరిని షాక్ గురిచేశాడు. అయితే తాను ఎందుకు రిటైర్మెంట్ చేయాల్సి వచ్చిందో అందరికీ అర్థమయ్యేలా లాజిక్ తో వివరించి సురేష్ రైనా అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. మహేంద్ర సింగ్ ధోని 39ఏళ్ల […]

Written By: Neelambaram, Updated On : August 17, 2020 3:55 pm
Follow us on


భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెల్సిందే. అంతర్జాతీయ క్రికెట్ కు నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ధోని ఇన్ స్ట్రాగ్రాములో పోస్టు చేసిన ఐదు నిమిషాల్లోనే ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించి అందరిని షాక్ గురిచేశాడు. అయితే తాను ఎందుకు రిటైర్మెంట్ చేయాల్సి వచ్చిందో అందరికీ అర్థమయ్యేలా లాజిక్ తో వివరించి సురేష్ రైనా అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

మహేంద్ర సింగ్ ధోని 39ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్ ప్రకటించగా సురేష్ రైనా మాత్రం 33ఏళ్లకే క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఇంకో ఐదారేళ్లు క్రికెట్ ఆడే సత్తా రైనాలో ఉన్నప్పటికీ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే వీరిద్దరు కూడా ముందుగా అనుకోని రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. వీరిద్దరు కూడా ఇంచుమించుగా ఒకేసారి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు.

ధోనీ 2004లో డిసెంబర్ 23న చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక  సురేష్ రైనా 2005 జూలై 30న శ్రీలంక మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆరేడు నెలల వ్యత్యాసంలోనే వీరిద్దరు ఒకేసారి ఎంట్రీ ఇచ్చి.. తాజాగా ఒకేసారి రిటైర్మెంట్ ఇచ్చారు. రిటైర్మెంట్ నిర్ణయం తాము ముందుగానే అనుకున్నట్లు పేర్కొన్నాడు. దీనికి ఓ లాజిక్ వివరణ కూడా ఇచ్చాడు.

ఆగస్టు 15న భారత్ 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంది. ధోని జెర్సీ నెంబర్ 7కాగా.. తనది 3నెంబర్ జర్సీ అని చెప్పాడు. ఈ రెండు కలిపితే 73 అవుతాయని తెలిపాడు. 73 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గుర్తుచేసేలా ధోని రిటైర్ అయిన వెంటనే తాను రిటైర్మెంట్ ప్రకటించినట్లు చెప్పాడు. తాను రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం వేరే లేదని రైనా పేర్కొనడం గమనార్హం.  తాను అంతర్జాతీయ క్రికెట్లో రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్ ఆడుతానని చెప్పాడు.