https://oktelugu.com/

Prabhakar Serial Actor Daughter: బుల్లి తెర ప్రభాకర్ కూతురు హీరయిన్ కి ఎ మాత్రం తీసుపోదు

Prabhakar Serial Actor Daughter: బుల్లితెరపై క్రియేటివ్ పర్సన్ గా ‘ప్రభాకర్’కు పేరుంది. బుల్లితెర మెగాస్టార్ అనే పేరు వచ్చింది. ఆయన ఈటీవీలో ఎంతో ప్రజాదరణ పొందిన సీరియళ్లను దివంగత సుమన్ తో కలిసి నిర్మించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సుమన్ ఆరోగ్యం క్షీణించాక.. ఈటీవీ నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం మాటీవీలు రెండు ప్రధాన సీరియళ్లు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. ‘వదినమ్మ’, గృహలక్ష్మీ సీరియళ్లు నిర్మిస్తూ నటిస్తున్నారు. జెమినీ టీవీలో దీపారాధన సీరియల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2022 / 08:50 AM IST
    Follow us on

    Prabhakar Serial Actor Daughter: బుల్లితెరపై క్రియేటివ్ పర్సన్ గా ‘ప్రభాకర్’కు పేరుంది. బుల్లితెర మెగాస్టార్ అనే పేరు వచ్చింది. ఆయన ఈటీవీలో ఎంతో ప్రజాదరణ పొందిన సీరియళ్లను దివంగత సుమన్ తో కలిసి నిర్మించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సుమన్ ఆరోగ్యం క్షీణించాక.. ఈటీవీ నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం మాటీవీలు రెండు ప్రధాన సీరియళ్లు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. ‘వదినమ్మ’, గృహలక్ష్మీ సీరియళ్లు నిర్మిస్తూ నటిస్తున్నారు. జెమినీ టీవీలో దీపారాధన సీరియల్ లో నారప్పగా నటిస్తున్నారు.

    Prabhakar Serial Actor Daughter

    ప్రభాకర్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. బుల్లితెర ప్రభాకర్ కు భార్య ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభాకర్ భార్య పేరు ‘మలయజ’ ఈమె ఇస్మార్ట్ జోడీలో ప్రభాకర్ తో కలిసి పాల్గొంది. ఈ ప్రభాకర్ ముద్దుల కూతురు పేరు ‘దివిజ’. తాను ఒక కూడా ఒక సీరియల్ లో నటించింది. అన్నాచెల్లెళ్లు అనే సీరియల్ లో పాత్ర పోషించింది. ఈ సీరియల్ లో తన నటనకు నంది అవార్డు కూడా అందుకుంది.

    దివిజ ప్రస్తుతం యూట్యూబ్ లోకి అడుగు పెట్టింది. మోడ్రన్ మహానటి పేరు మీద ద మిక్స్ అనే చానెల్ ద్వారా వారానికి ఒక ఎపిసోడ్ చేస్తోంది. తమడా మీడియా ద్వారా కొన్ని ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. అవి కూడా మంచి వ్యూస్ సంపాదిస్తున్నాయి.

    Prabhakar Serial Actor Daughter

    నటనలో ఆరితేరిన దివిజ తాజాగా ‘వదినమ్మ’ సీరియల్ లో మెయిన్ రోల్ పోషిస్తున్న నటితో కలిసి డ్యాన్స్ వీడియో చేసింది. ఈ ఇన్ స్టాగ్రామ్ రీల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభాకర్ కూతురు హీరోయిన్ కు సాటిలేదని.. ఆమె సినిమాల్లోకి రావాలని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

    Tags