https://oktelugu.com/

Krishnam Raju: షాకింగ్: ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు ప్రమాదం.. సర్జరీ.. వేలు తొలగింపు

Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్, ప్రభాస్ పెద్దనాన్నా కృష్ణంరాజుకు ప్రమాదం జరిగింది. ఈ మేరకు షాకింగ్ విషయం వెలుగుచూసింది. టాలీవుడ్ ప్రముఖులంతా ఇప్పుడు కృష్ణంరాజుకు ఏమైందని ఆరాతీస్తున్నారు. ప్రస్తుతం కృష్ణంరాజుకు సర్జరీ చేశారని తెలిసింది. నటుడు కృష్ణంరాజు ఇటీవల ప్రమాదానికి గురయ్యారు.సెప్టెంబర్ లో కాలు జారి బాత్రూంలో కింద పడ్డారని సమాచారం. ఆ సమయంలో ఆయన తుంటి భాగానికి ఫ్రాక్చర్ అయ్యింది. అపోలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని కోలుకున్నారని తెలిసింది. […]

Written By: , Updated On : March 9, 2022 / 08:42 AM IST
Follow us on

Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్, ప్రభాస్ పెద్దనాన్నా కృష్ణంరాజుకు ప్రమాదం జరిగింది. ఈ మేరకు షాకింగ్ విషయం వెలుగుచూసింది. టాలీవుడ్ ప్రముఖులంతా ఇప్పుడు కృష్ణంరాజుకు ఏమైందని ఆరాతీస్తున్నారు. ప్రస్తుతం కృష్ణంరాజుకు సర్జరీ చేశారని తెలిసింది.

Krishnam Raju

Krishnam Raju

నటుడు కృష్ణంరాజు ఇటీవల ప్రమాదానికి గురయ్యారు.సెప్టెంబర్ లో కాలు జారి బాత్రూంలో కింద పడ్డారని సమాచారం. ఆ సమయంలో ఆయన తుంటి భాగానికి ఫ్రాక్చర్ అయ్యింది. అపోలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని కోలుకున్నారని తెలిసింది.

Also Read: Prabhas Salaar Movie: నాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నాడు – ప్రభాస్

ఇటీవల మరోసారి కృష్ణంరాజు కాలు జారి పడ్డారని.. ఈ క్రమంలోనే మరో చిన్న సర్జరీ అవసరమైందని అంటున్నారు. సర్జరీలో ఆయన కాలు వేలును కూడా తొలగించాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు ఆరోగ్యంగా ఉన్నారని.. క్షేమంగానే ఉంటున్నారని తెలిసింది.

Krishnam Raju

Krishnam Raju

ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’లో కృష్ణంరాజు నటించారు. ఆ సినిమాలో ఆయన ఒక పరమహంస అనే సాధువు పాత్రలో కనిపించబోతున్నారు. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read: Samantha: అందులో కూడా రాణిస్తాను – సమంత

Tags