Pawan Kalyan : అనేక మంది పవన్ కళ్యాణ్ ని ఆయన ఎంచుకున్న మార్గాలను విమర్శిస్తుంటారు. ఒకప్పుడు చేగువేరా లాంటి కమ్యూనిస్ట్ భావాలు ఉన్నోడిని అని చెప్పారు , కానీ ఇప్పుడు బీజేపీ తో కలిసి ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ లెఫ్ట్ భావజాలం కలిగి ఉన్నోడా?, లేదా రైట్ భావజాలం ఉన్నోడా?, అసలు ఆయన సిద్ధాంతాలు ఏంటి అంటూ సోషల్ మీడియా లో ప్రత్యర్థులు ట్రోల్ చేస్తూ ఉండేవారు. అయితే దీని పై పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో స్పందించారు. నేను లెఫ్ట్ కాదు , రైట్ కాదు , మధ్యలో తటస్థంగా ఉండే వ్యక్తిని. రెండిట్లోనూ మంచివి తీసుకొని సమాజం బాగు కోసం ఉపయోగించాలని చూస్తుంటాను అంటూ చెప్పుకొచ్చారు. ఆయన పలు మార్లు ఇదే చెప్తూ వచ్చినప్పటికీ కూడా ప్రత్యర్థులు విమర్శిస్తూనే ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ లాగానే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఎలోన్ మస్క్ కూడా ఈ అంశం పై స్పందించారు.
రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘నిజమైన లీడర్ షిప్ ని అనుసరించేవాళ్ళు , లెఫ్ట్ లేదా రైట్ ఐడియాలజీ ని అనుసరించరు. జనాలకు ఆ రెండిటి నుండి మంచివి తీసుకొని పరిపాలించాలి. జనాలకు ఏదైతే ముఖ్యమో అదే ఆలోచించాలి. మానవత్వం చూపించాలి, రెండు భావజాలకు పూర్తిగా అడాప్ట్ కాకుండా , కేవలం న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటేనే సమూలమైన మార్పులు సమాజం లో తీసుకొని రాగలం’ అంటూ చెప్పుకొచ్చారు ఎలోన్ మస్క్. ఈయనకు పవన్ కళ్యాణ్ తెలుసో లేదో తెలియదు కానీ , పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో ఈ అంశం పై ఏదైతే చెప్తుంటారో , అదే ఈ ఇంటర్వ్యూ లో ఎలోన్ మస్క్ చెప్పుకొచ్చారు. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ ని విమర్శించేవాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో లేదో చూడాలి.
సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఎలోన్ మస్క్ కి సంబంధించిన లేటెస్ట్ ఇంటర్వ్యూ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన భుజాలకు సర్జరీ చేయించుకోవడం కోసం ముంబై కి వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న ఆయన కుడి భుజానికి 3 గంటల పాటు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు సూచించారు. అదే విధంగా రెండవ భుజానికి రెండు నెలలు గ్యాప్ తర్వాత సర్జరీ చేయించుకోనున్నారు పవన్ కళ్యాణ్. మరోపక్క ఆయన నవంబర్ నెల నుండి ఓజీ 2 మూవీ షూటింగ్ ని మొదలుపెట్టబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
In a world increasingly divided by extremes, true leadership is not about choosing the Left or the Right, it is about choosing what is right.
The Middle Path is not neutrality. It is the courage to rise above ideology, reject polarization, and put humanity first.
Whether it is… pic.twitter.com/4fsxI21k0R
— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 12, 2026
