Posani Krishnamurali: నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి కాస్త పైత్యం ఉంది. ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడతాడో ఆయనకే తెలియదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పై సీరియస్ కామెంట్స్ చేసి.. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ దెబ్బకు భయపడి పోయి.. గత కొన్ని రోజులుగా బయట తిరగడానికి భయపడుతున్న పోసాని.. ప్రస్తుతం విచారం వ్యక్తం చేస్తున్నాడు. తనను క్షమించాలని నిర్మాతలను కోరాడు.

ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే పోసాని పై మెగా ఫ్యామిలీ సీరియస్ గా ఉంది. మెగా మదర్ పై కూడా పోసాని కామెంట్స్ చేశాడు. ఆ విషయంలో చిరంజీవి కోపంగా ఉన్నారు. అందుకే, చాలామంది నిర్మాతలు పోసానిని తమ సినిమాల నుండి తప్పించారు. ఇక ఆల్ రెడీ పోసానితో సగం షూటింగ్ చేసిన వారు.. తప్పక పోసానిని కంటిన్యూ చేయాల్సి వస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో పోసాని క్షమాపణ చెప్పడానికి కారణం… గత కొన్ని రోజులుగా పోసాని ఎవరికీ అందుబాటులో లేడు. తనతోపాటు తన కుటుంబసభ్యులను కూడా ఇంటి నుంచి బయటకు పంపలేదు. దాంతో తాను నటిస్తున్న రెండు పెద్ద సినిమాల షూటింగ్ లకు గ్యాప్ వచ్చింది. కేవలం తన వల్లే షూట్ ఆగిపోయినందుకు పోసాని ఆ నిర్మాతలకు సారీ చెప్పాడు.
ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలు తనను క్షమించాలని.. ఇక నుంచి ఇలాంటి గొడవల్లో జోక్యం చేసుకోను అని పోసాని చెప్పుకొచ్చాడు. పోసానిలో ఉన్నట్టు ఉండి ఈ మార్పు రావడానికి కారణం.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేస్తూ.. తన పై దాడి చేయడానికి కూడా సిద్ధం అయితే, జగన్ గాని, జగన్ ప్రభుత్వం వారు గానీ ఖండించలేదు.
ఈ విషయంలో పోసాని బాగా ఫీల్ అయినట్టు తెలుస్తోంది. కేవలం జగన్ కి సపోర్ట్ గా మాట్లాడి సమస్యలు తెచ్చుకుంటే.. చివరకు ఆ జగన్ కూడా పట్టించుకోకపోవడం పై పోసాని బాగా నిరాశగా ఉన్నాడు.