NTR: సినిమా ఇండస్ట్రీలో హీరో అవ్వడం అంటే మాటలా ? పైగా హీరోయిజమ్ కి సింబాలిజమ్ లాంటి తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం గొప్ప విషయం. ఇక హీరోగా విజయాలు సాధించడం అంటే.. అది ఓ రికార్డు. అయితే.. ఒకప్పుడు హీరోగా విజయాలు అందుకున్నా… ఆ తర్వాత కాల ప్రవాహంలో హీరో నుంచి జీరో స్థాయికి పడిపోతుంటారు కొందరు. ఆ లిస్ట్ లో ప్రముఖుడు వేణు తొట్టెంపూడి.

వేణు తొట్టెంపూడి హీరోగా ఏడేళ్ల పాటు ఫుల్ బిజీగా కొనసాగాడు. ఆ తర్వాత అవకాశాలు తగ్గాయి. ఇక చేసేది ఏమి లేక ‘చింతకాయల రవి’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఆ తర్వాత ‘గోపి గోపిక గోదావరి’ సినిమాతో మరోసారి హీరోగా హిట్ అందుకున్నాడు. కానీ ఆ సక్సెస్ ను ఎక్కువకాలం కొనసాగించలేకపోయాడు. మళ్లీ దమ్ము సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు.
మధ్యలో రామాచారి లాంటి సోలో హీరో సినిమాలు చేసినా.. వరుస ఫ్లాపులు కారణంగా మొత్తానికి హీరోగా మళ్ళీ కనుమరుగైపోయాడు. మరి వేణు తొట్టెంపూడి పరిస్థితి ఏమిటీ ? గత పదిహేను ఏళ్ల నుంచి సరైన సినిమా పడని హీరో పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. అందుకే ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడానికి వేణు కసరత్తులు చేస్తున్నాడు.
ఇప్పటికే రవితేజ ఎమ్మార్వో గా నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో వేణు తొట్టెంపూడి ఓ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ అవకాశం కోసం వేణుకి ఎన్టీఆర్ సాయం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అదే ఎన్టీఆర్ దయతో.. వేణుకి మరో సినిమా వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ఓ సినిమాలో బ్రదర్ క్యారెక్టర్ ఉంది.
వెరీ ఎమోషనల్ గా ఉంటుంది ఆ పాత్ర. అందుకే ఆ పాత్రలో కొరటాల ఓ స్టార్ హీరోని తీసుకోవాలని ప్లాన్ చేశాడు. ఓ దశలో తమిళ హీరో జీవాని కూడా అనుకున్నారు. అయితే, ఎన్టీఆర్ సపోర్ట్ తో ఇప్పుడు ఆ పాత్రలో వేణు తొట్టెంపూడి నటించబోతున్నాడు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు సరైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల అవసరం చాలా వుంది కాబట్టి.. ఈ సారి వేణు సక్సెస్ అవుతాడేమో చూడాలి.