Posani Krishna Murali : ప్రముఖ సినీ నటుడు, రచయత, వైసీపీ పార్టీ నేత పోసాని కృష్ణ మురళి(Posani krishna Murali) ని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసి పీటీ వారంట్ తో రాష్ట్రం మొత్తం లో ఉన్న జైళ్లకు తిప్పుతున్న సంగతి తెలిసిందే. ఒక కేసు లో బెయిల్ వస్తే, మరో కేసు అతనిపై బుక్ చేయడం, ఆ కేసు లో బెయిల్ వస్తే మరో కేసు లో బుక్ చేయడం, అలా గత ఐదేళ్లుగా విచ్చలవిడిగా మాట్లాడిన మాటలకు కూటమి పార్టీల అభిమానులు పోసాని పై కేసులు వేస్తూ చుక్కలు చూపించేస్తున్నారు. ఈ నేపథ్యం లో పోసాని కి హై కోర్టు లో కాస్త ఊరట లభిస్తుంది. గతం లో ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాష్ట్రంలోని నాలుగు పోలీస్ స్టేషన్స్ లో నమోదైన కేసులను కొట్టి వేయాలని పోసాని తరుపున న్యాయవాది హై కోర్టులో క్వాష్ పిటీషన్(Quash Petition) దాఖా చేసారు.
Also Read : ఫాఫం.. పోసానిని తిప్పిన చోట తిప్పకుండా తిప్పుతున్నారే?
ఈ మేరకు నేడు ఈ పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం విశాఖపట్నం తో పాటు, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులలో తొందరపాటు చర్యలు తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటీషన్ కి సంబంధించిన తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఇది ఇలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆదోని నియోజకవర్గం లో జనసేన పార్టీ నాయకులు కేసు వేయగా , పీటీ వారెంట్ తో ఆయన్ని కాసేపటి క్రితమే కర్నూలు సెంట్రల్ జైలుకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. త్వరలోనే ఆయనపై శ్రీకాకుళం జిల్లా నుండి కూడా కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని, పవన్ కళ్యాణ్ పిల్లలను తిట్టినందుకు అతనిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
చూస్తుంటే ఆయన కేసులన్నీ తప్పించుకొని బయటకు రావడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టేలా అనిపిస్తుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పోక్సో చట్టం క్రింద పోసాని పై కేసు నమోదు అయితే ఇప్పట్లో ఆయన బయటకి వచ్చే అవకాశాలే ఉండకపోవచ్చు. మరి ఏమి జరగబోతుందో చూడాలి. మరోవైపు పోసాని సజ్జల రామకృష్ణ, అతని కొడుకు సజ్జల భార్గవ్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే తానూ అలా అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని, అందుకు తనకు నెలకు మూడు లక్షల రూపాయిల జీతం కూడా ఇచ్చేవారని పోసాని రిమాండ్ లో వాంగ్మూలం ఇవ్వడంతో సజ్జల రామకృష్ణ, అతని కుమారుడు హై కోర్టు ని ఆశ్రయించి తమకు ముందస్తు బైలు మంజూరు చేయాలనీ కోరారు. త్వరలోనే వీళ్లిద్దరు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్.
Also Read : పోసాని, వల్లభనేని వంశీ విషయంలో సరికొత్త అస్త్రాన్ని ప్రవేశపెట్టిన ఏపీ పోలీసులు.. తర్వాత జరిగేది అదేనా?