Posani Krishna Murali & Vallabhaneni Vamsi : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. గత వైసిపి పరిపాలన కాలంలో జరిగిన ఘటనలపై దృష్టి సారించింది.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై జరిగిన దాడిని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నాడు పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో వల్లభనేని వంశీ ప్రమేయం ఉందని ఏపీ పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సత్య వర్ధన్(తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు ఇటీవల హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు.
Also Read : పోసాని కృష్ణ మురళి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..జీవితాంతం ఇక జైలులోనే? కేసులో ఊహించని ట్విస్ట్!
వల్లభనేని వంశీ అరెస్టును మర్చిపోకముందే ఏపీ పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. ఈయన సినీ నటుడిగా, దర్శకుడిగా కొనసాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు టిడిపి నేతలు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇటీవల హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో పోసాని కృష్ణమురళి ఉండగా.. అరెస్టు చేశారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. రైల్వే కోడూరు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. ఆయన 14 రోజులపాటు రిమాండ్ విధించారు. పోసాని కృష్ణ మురళికి బెయిల్ ఇవ్వాలని వైసిపి తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ వాదించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో పోసాని కృష్ణ మురళిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనను విచారిస్తుండగా తాను సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ చెప్పినట్టుగానే చేశానని.. అందువల్లే విమర్శలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు తమను అరెస్టు చేయకుంటే విచారణకు సహకరిస్తామని వారు పేర్కొన్నారు.. ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే సోమవారం ఏపీ పోలీసులు పోసాని, వల్లభనేని వంశీ వ్యవహారంలో మరో కీలక అడుగు వేశారు.. సరికొత్త అస్త్రాన్ని బయటకి తీశారు.
పీటీ వారెంట్ జారీ
పోసాని కృష్ణ మురళి, వల్లభనేని వంశీ వ్యవహారంలో ఏపీ పోలీసులు సోమవారం పిటి వారెంట్లు దాఖలు చేశారు. పీటీ వారంట్ అంటే ఫ్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్.. ఒక కేసులో అరెస్టయి జైల్లో ఉన్న విచారణ ఖైదీని.. మరొక కేసుల విచారించడానికి ఇతర ప్రాంతానికి తీసుకెళ్లడానికి పోలీసులు కోర్టు అనుమతి తీసుకోవాలి. ఇలా అనుమతి తీసుకోవడానికి జైలు అధికారులకు అందించే పత్రాలను పిటి వారెంట్ అంటారు. అయితే కేవలం టిడిపి కార్యాలయం పై దాడి, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులు మాత్రమే కాకుండా.. ఇతర విషయాలను కూడా వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి ద్వారా బయటపెట్టాలని ఏపీ పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.. పోసాని కృష్ణమురళి ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ వ్యవహరించిన తీరుకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. వల్లభనేని వంశీ ని విచారిస్తున్న సమయంలో ఎటువంటి విషయాలు బయటకు చెప్పారనేది ఇంతవరకు ఏపీ పోలీసులు వెల్లడించలేదు. మొత్తానికి వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి వ్యవహారంలో ఏపీ పోలీసులు పిటి వారెంట్ జారీ చేయడం సంచలనంగా మారింది.
Also Read : వంశీ కేసులో జగన్మోహన్ రెడ్డి.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు!