Homeఎంటర్టైన్మెంట్నన్ను తల్లిని చెయ్యాల్సింది ఆయనే: పూనమ్ పాండే

నన్ను తల్లిని చెయ్యాల్సింది ఆయనే: పూనమ్ పాండే

Poonam Pandeyహాట్ బాంబ్ పూనమ్ పాండే వెరీ బోల్డ్. అందాలను ఆరబోయటంలో మాస్టర్స్ చేసింది. ఎంత విచ్చలవిడిగా పూనమ్ రెచ్చిపోయినా, పూనమ్ మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. ఐటమ్ సాంగ్స్ కూడా ఈ బ్యూటీకి రాకపోయేసరికి సోహెల్ మీడియాలోనే రచ్చ చేసుకుంటూ ముందుకు పోతుంది. అయితే తాజాగా పూనమ్ పాండే తల్లి కాబోతుందని పుకార్లు వచ్చాయి.

ఆ పుకార్లను మీడియా, సోషల్ మీడియా పోటీ పడి మరీ ప్రచారం చేశాయి. అయితే, ఈ భారీ భామ తన పై వచ్చిన ఈ కొత్త పుకార్ల పై వెరైటీగా స్పందించింది. పూనమ్ మాటల్లోనే ‘ఇప్పటికే మీడియా నన్ను చాలాసార్లు తల్లిని చేసింది. కానీ నన్ను తల్లిని చెయ్యాల్సింది నా పార్ట్నర్’ అంటూ పూనమ్ మీడియా కథనాల పై తనదైన శైలిలో మండిపడుతూనే, ఈ కామెంట్స్ లో కూడా తన శైలి బోల్డ్ నెస్ ఉండేలా చూసుకుంది.

ఏది ఏమైనా పూనమ్ పాండే నటించిన సినిమాలు తక్కువ అయినా, అమ్మడికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా పూనమ్ సోషల్ మీడియాలో చేసే ‘అంగాంగ ప్రదర్శన’కు విశేష అభిమానులు ఉన్నారు. ఇక ‘సామ్ బాంబే’ అనే వ్యాపారవేత్తని గతేడాది ఘనంగా పెళ్లి చేసుకొంది పూనమ్ పాండే. పెళ్లి తరువాత కూడా తన హాట్ హాట్ షోలను మాత్రం ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ముందుకు పోతుంది

ఇక తన పై వచ్చే వార్తలకు పూనమ్ మాట్లాడుతూ ‘నేను నిజంగా గర్భవతిని అయితే ఆ విషయాన్ని నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాను, కాబట్టి అది నిజం అయినప్పుడు నేనే ప్రకటిస్తా. ఎందుకంటే అది దాచుకోవాల్సిన విషయం కాదు కదా, పైగా నాకు ఇప్పుడు పెళ్లి కూడా అయింది’ అని సిగ్గు పడుతూ మీడియాకి స్పష్టం చేసింది. అయితే తనకు ఇప్పుడే పిల్లలను కనాలనే ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version