https://oktelugu.com/

Poonam Kaur : జానీ మాస్టర్ లాంటోళ్ళు రెచ్చిపోవడానికి అసలు కారణం త్రివిక్రమ్ : పూనమ్ కౌర్

నేడు ఆమె త్రివిక్రమ్ గురించి మరోసారి మాట్లాడుతూ 'ఇండస్ట్రీ లో గురూజీ అని పిలవబడే త్రివిక్రమ్ శ్రీనివాస్ నన్ను మోసం చేసాడు. ఫిలిం ఛాంబర్ కి, మా అసోసియేషన్ కి ఎన్నో సార్లు నేను ఈ విషయంపై కంప్లైంట్ చేశాను.

Written By:
  • Vicky
  • , Updated On : September 17, 2024 / 08:56 PM IST

    Poonam Kour

    Follow us on

    Poonam Kaur : జానీ మాస్టర్ పై యంగ్ డ్యాన్సర్ శ్రేష్ఠి వర్మ సంచలన ఆరోపణలు చేస్తూ నిన్న ఉదయం నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఘటన ఇండస్ట్రీ లో పెను దుమారం రేపింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చలు. ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ అనే డ్యాన్స్ షో ద్వారా పరిచయమైనా శ్రేష్ఠి వర్మ ని తన డ్యాన్స్ టీం లోకి చేర్చుకున్న జానీ మాస్టర్, గత కొంత కాలం నుండి ఆమెని లైంగికంగా వేధించడంతో తట్టుకోలేక నిన్న ధైర్యం గా ఒక అడుగు ముందుకేసి ఆయనపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఈ అంశంపై ఇండస్ట్రీ లో అనేక మంది స్పందించారు. జనసేన పార్టీ లో ఒక కీలక నేతగా కొనసాగుతున్న జానీ మాస్టర్ ని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. నిజానిజాలు తేలేవరకు పార్టీ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. మరోపక్క ఫిలిం ఛాంబర్ కూడా ఈ కేసు ని చాలా సీరియస్ గా తీసుకుంది.

    జానీ మాస్టర్, శ్రేష్ఠి వర్మ వద్ద రికార్డింగ్స్ తీసుకున్నామని, విచారణ మొదలుపెట్టామని, 90 రోజుల్లో నిజానిజాలు బయటపెడుతాము అంటూ నేడు ప్రెస్ మీట్ ద్వారా మీడియా కి తెలియచేసాడు. మరో పక్క ప్రముఖ యాంకర్ ఝాన్సీ కూడా ఈ సంఘటనపై స్పందించింది. ఆమెకి జానీ మాస్టర్ తన కోరిక తీర్చలేదని అవకాశాలు రానివ్వకుండా చేసాడని, ఈ సంఘటనను అంత తేలికగా విడిచిపెట్టకూడదని ఆమె ప్రెస్ మీట్ ద్వారా తెలిపింది. ఇవన్నీ పక్కన పెడితే ఇండస్ట్రీ లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ తనకి జరిగిన అన్యాయం గురించి సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ జల్సా సినిమాలో తనకి సెకండ్ హీరోయిన్ రోల్ ఇస్తానని, నన్ను ఇష్టమొచ్చినట్టు వాడుకొని చివరికి మోసం చేసాడని అనేక మార్లు సోషల్ మీడియా లో ఈమె వాపోయిన సంగతి తెలిసిందే.

    నేడు ఆమె త్రివిక్రమ్ గురించి మరోసారి మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ లో గురూజీ అని పిలవబడే త్రివిక్రమ్ శ్రీనివాస్ నన్ను మోసం చేసాడు. ఫిలిం ఛాంబర్ కి, మా అసోసియేషన్ కి ఎన్నో సార్లు నేను ఈ విషయంపై కంప్లైంట్ చేశాను. అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆరోజు సరైన రీతిలో స్పందించి త్రివిక్రమ్ మీద యాక్షన్ తీసుకొని ఉండుంటే, ఈరోజు జానీ మాస్టర్ లాంటోళ్ళు ఇలాంటి చర్యలు చేయడానికి భయపడేవారు, కానీ అలా చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్. ఈ విషయం లో పవన్ కళ్యాణ్ కూడా తనకి న్యాయం చేయలేదని అనేక సార్లు పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసింది ఈ హాట్ బ్యూటీ. నేడు ఈమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. దీనిని ప్రత్యర్థి వైసీపీ పార్టీ వాడుకుంటూ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు.