Homeఎంటర్టైన్మెంట్Poonam Pandey: పూనమ్ చనిపోలేదు.. అసలు విషయం బయటపెట్టిన బాడీగార్డ్

Poonam Pandey: పూనమ్ చనిపోలేదు.. అసలు విషయం బయటపెట్టిన బాడీగార్డ్

Poonam Pandey: ఎవరిని అయినా అభిమానిస్తే.. వారికి సంబంధించిన ఏ నెగటివ్ వార్తను కూడా జీర్ణించుకులేరు. అలా జీర్ణించుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక సినిమా ఇండస్ట్రీలో అభిమాన నటీనటులకు ఏదైనా జరిగితే అభిమానులు తల్లడిల్లిపోతుంటారు. అయితే మోడల్ పూనమ్ పాండే చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈమె చనిపోవడానికి ఆమె బాడీగార్డ్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆయన మాటలు అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా?

నటి, మోడల్ పూనమ్ పాండే మృతి నిన్న చనిపోయిన విషయం తెలిసిందే. గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతూ సడన్ గా చనిపోయింది. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆమె అభిమానులు కంటతడి పెట్టారు. అంతేకాదు ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. శృంగార తారగా పూనమ్ ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతిచిన్న వయసులోనే ఆమె చనిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పూనమ్ మృతి వార్త విన్న ఆమె బార్డీ గాడ్ ఆమె లేదు అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను అన్నారు.

పూనమ్ కుటుంబ సభ్యులు అధికారికంగా ఆమె చనిపోయినట్టు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. పూనమ్ దగ్గర 11 సంవత్సరాలు బాడీగార్డ్ గా పని చేస్తున్న అమిన్ ఖాన్ మాట్లాడుతూ.. పూనమ్ చనిపోలేదు. ఆమె చనిపోయింది అంటే నేను నమ్మను. ఆమెతో నేను ఎన్నో సంవత్సరాలు కలిసి పనిచేశాను. పూనమ్ ఎలా ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు అని ఆవేదన చెందారు. అంతేకాదు జనవరి 31న మేము కలిశాం. ఒక మాల్ లో ఫోటోషూట్ కోసం వెళ్ళినప్పుడు నేను అక్కడే ఉన్నాను. పూనమ్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఫిట్ గా ఉంటుంది. నవ్వుతూ ఉంటుంది. ఆమెకు అసలు అనారోగ్యం ఉందన్న విషయం కూడా నేనెప్పుడూ వినలేదు.

ఉదయం నేను కూడా సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నాను. వెంటనే పూనమ్ సోదరి ఇంటికి వెళ్లి నిజమేంటో తెలుసుకుందామని ప్రశ్నించాను అని.. కానీ ఆమె నా ఫోన్స్ ఆన్సర్ చేయడం లేదని.. అసలు నిజం ఏంటో తెలియాల్సి ఉందన్నారు. తన సోదరి రిప్లై కోసం ఎదురుచూస్తున్నాను అని.. కొన్ని రోజుల క్రితం పూనమ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అంతా నార్మల్ గానే కనిపించింది అన్నారు. ఆమె ఆల్కహాల్ తీసుకోవడం కూడా మానేసిందని.. అసలు నిజాలు తెలియాలంటే పూనమ్ సోదరి చెప్పాల్సిందే అని ఆవేదన చెందారు. మరి ఈమె ఎప్పుడు ముందుకు వచ్చి ఈ విషయాలను వెల్లడిస్తుందో చూడాలి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Rajinikanth Biopic: వెండితెర పైకి సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్.. హీరో ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Rajinikanth Biopic: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం అనేది సాధారమైన విషయం కాదు. కృషి , పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా...

Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే…

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. శివ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత...

Ram Charan : 2027 లో రామ్ చరణ్ సినిమా లేనట్టే.. అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'పెద్ది' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా...

Jana Nayagan : ‘జన నాయగన్ ‘ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ టాక్ తో...

Jana Nayagan : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని...

Chennai Love Story : ‘చెన్నై లవ్ స్టోరీ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్...

Chennai Love Story : కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , బంపర్ ఓపెనింగ్స్ ని...
Oktelugu Epaper
Exit mobile version