Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan : 'జన నాయగన్ ' 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్...

Jana Nayagan : ‘జన నాయగన్ ‘ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ టాక్ తో ఈ గ్రాస్ ఎవరికీ సాధ్యం కాదేమో..

Jana Nayagan : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ తేడా అయినప్పటికీ కూడా ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం సూపర్ హిట్ రేంజ్ అనే తరహాలో వస్తున్నాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి వీకెండ్ పూర్తి అయ్యేసరికి కచ్చితంగా 180 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు లో నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అట. ఇది సెన్సేషనల్ గ్రాస్ అనే చెప్పాలి. రాష్ట్రాల వారీగా ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ వసూళ్లను ఒకసారి వివరంగా చూద్దాం.

తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి 61 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. చూస్తుంటే ఈ సినిమాతో కూడా తమిళనాడు రాష్ట్రంలో విజయ్ 100 కోట్ల గ్రాస్ ని అవలీలగా దాటేలా అనిపిస్తోంది. స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు కూడా ఇక్కడ కొన్ని 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవడం విఫలం అయ్యాయి. అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వెట్టియాన్’ అనే చిత్రం కూడా ఉంది. ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక నుండి 17 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కేరళ నుండి 8 కోట్లు , ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ ప్రాంతాల నుండి 7 కోట్లు , నార్త్ ఇండియా నుండి 4 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 97 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక విజయ్ కి కంచుకోట లాగా పిలవబడే ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి మొదటి మూడు రోజులు అదిరిపోయే రేంజ్ వసూళ్లు వచ్చాయి. అక్కడి ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ చిత్రానికి 5.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి . ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూస్తే 53 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. మొత్తం మీద ఈ చిత్రానికి 3 రోజులకు కలిపి 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఫుల్ రన్ 220 నుండి 240 కోట్ల మధ్యలో గ్రాస్ రాబట్టే అవకాశాలు కూడా ఉన్నాయట. ఒక డిజాస్టర్ సినిమాతో ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం అనేది సాధారమైన విషయం కాదు , భవిష్యత్తులో ఏ హీరో కూడా ఈ అరుదైన రికార్డు ని కొట్టలేరేమో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Chennai Love Story : ‘చెన్నై లవ్ స్టోరీ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్...

Chennai Love Story : కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , బంపర్ ఓపెనింగ్స్ ని...

Cockroach Janata Party : ఎగతాళి నుంచి పుట్టి.. ఎదురొడ్డి పోరాడి..

Cockroach Janata Party : ఇటీవలి కాలంలో భారత రాజకీయాల్లో ఒక కొత్త శక్తి ఆవిర్భవించింది. సంప్రదాయ పార్టీలను అధిగమించి ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు కోట్ల మంది అనుచరులను సంపాదించుకున్న కాక్రోచ్‌ జనతా పార్టీ...

Today horoscope in telugu 27.7.2026 : ఈ నాలుగు రాశుల వారు అదృష్టవంతులు..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Cockroach Janata Party Funding : కాక్రోచ్ జనతా పార్టీకి ఫండ్.. “లెక్క” భారీగానే ఉందిగా..

Cockroach Janata Party Funding : కావలసినంత ఆహారం వచ్చింది. డ్రై ఫ్రూట్స్ ఊహించని విధంగా వచ్చాయి. మెడికల్ కిట్లు.. ఫాస్ట్ ఫుడ్.. డ్రింక్స్.. టెంట్లు.. రాళ్లు.. రప్పలు.. ఇవన్నీ ఆకాశరామన్న పంపించినట్టు...

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Oktelugu Epaper
Exit mobile version