Hanuman: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న హనుమాన్ సినిమా..

92 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో అరుదైన రికార్డ్ ను హనుమాన్ సొంతం చేసుకుంది. అంతేకాదు సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన తెలుగు సినిమాల్లో హైయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా కూడా నిలిచింది హనుమాన్. స్టార్ హీరో మహేష్ బాబు కూడా సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

Written By: Swathi Chilukuri, Updated On : February 3, 2024 2:33 pm
Follow us on

Hanuman: ఈ సంవత్సరం విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలలో హనుమాన్ సినిమా ఒకటి. చిన్న సినిమాగా వచ్చిన సంచలన విజయాలను అందుకుంది. సంక్రాంతికి పోటీలో ఉన్న ఈ సినిమా నెంబర్ వన్ గా నిలిచింది. ఇందులో హీరో సజ్జ తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఒక్కసారిగా అనుకోని విధంగా ఫేమస్ అయ్యారు ఈ హీరో. కుటుంబ సమేతంగా ఎంతో మంది థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేశారు అని చెప్పడంలో సందేహం లేదు. ఆ రేంజ్ లో హిట్ అయింది హనుమాన్ సినిమా.

92 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో అరుదైన రికార్డ్ ను హనుమాన్ సొంతం చేసుకుంది. అంతేకాదు సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన తెలుగు సినిమాల్లో హైయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా కూడా నిలిచింది హనుమాన్. స్టార్ హీరో మహేష్ బాబు కూడా సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈయన నటించిన గుంటూరు కారం సినిమాను మించి పోయింది హనుమాన్ సినిమా అంటూ కామెంట్లు వ్యక్తం అయ్యాయి. ఈ సినిమా సాధించిన సరికొత్త రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవడం కూడా కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. అప్పుడు మాత్రమే కాదు ఈ రోజు కూడా ఊహించని రేంజ్ లో బుకింగ్స్ జరిగాయట.

అద్భుతమైన టాక్ వస్తే చిన్న సినిమాలు కూడా రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే హనుమాన్ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకొనిపోయింది. ఇక రాబోయే రోజుల్లో కూడా కలెక్షన్ల పరంగా ఊహించని రేంజ్ లో రికార్డులను సొంతం చేసుకునే ఛాన్స్ ఉందట. ఈ సినిమా సాధించిన విజయం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో పాఠాలను నేర్పింది అంటున్నారు కొందరు. ఇక తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ మరే ఇతర సినిమాల పోటీ లేకుండా సినిమాను రిలీజ్ చేసి ఉంటే మరిన్ని రికార్డులు సొంతం చేసుకునేది అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాకు హనుమంతుని ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు హనుమాన్ భక్తులు. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ రెమ్యూనరేషన్ భారీ రేంజ్ లో ఉందట. అంతేకాదు సజ్జ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిందని టాక్. ఇక ఇతర భాషలపై కూడా ప్రశాంత్ వర్మ దృష్టి పెడితే ఈయన రేంజ్ ను అందుకోవడం కూడా కష్టమే అవుతుంది కావచ్చు అంటున్నారు ఆయన అభిమానులు.