https://oktelugu.com/

Poonam Pandey: వామ్మో పూనమ్ పాండే ఇన్ని వివాదాల్లో నిలిచిందా?

పూనమ్ పాండే బోల్డ్ షూట్స్, వీడియోలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేవారు. 2011లో పూనమ్ పాండే క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే తాను టీమ్ ఇండియా కోసం గ్రౌండ్ లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి వార్తల్లో నిలిచింది.

Written By: , Updated On : February 3, 2024 / 02:52 PM IST
Poonam Pandey
Follow us on

Poonam Pandey: బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే మరణం అందరినీ షాక్ కు గురి చేసింది. తరచూ వివాదాలతో వార్తల్లో ఉండే పూనమ్ సర్వైకల్ క్యాన్సర్ తో కన్నుమూయడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. లాక్ అప్ రియాల్టీ షోలో చివరిసారిగా కనిపించిన పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్లు ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేశారు. అయితే పూనమ్ పాండే మేనేజర్ పరుల్ చావ్లా ఆమె మరణాన్ని ధృవీకరించారు. 32 సంవత్సరాల వయసులో ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ నటి క్యాన్సర్ తో మరణించడంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పూనమ్ పాండే బోల్డ్ షూట్స్, వీడియోలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేవారు. 2011లో పూనమ్ పాండే క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే తాను టీమ్ ఇండియా కోసం గ్రౌండ్ లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి వార్తల్లో నిలిచింది. ఇక టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలుచుకోవడంతో ఆమె తన మాట నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయగా.. బీసీసీఐ అడ్డకుంది. అప్పుడు ఆమె వయసు 19 సంవత్సరాలు.

ఆ తర్వాత సంవత్సరం తనకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటో పోస్టు చేసి సంచలనం రేపారు. కోవిడ్-19 లాక్ డాన్ సమయంలో పూనమ్ పాండే, ఆమె భర్త నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు రావడంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. కోవిడ్ సమయంలో బాధ్యతారహితంగా ప్రవర్తించిన వీరిపై విమర్శలు వెల్లువెత్తాయి.

2017 పూనమ్ పాండే పాండే యాప్ ప్రారంభించారు. కంటెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ గూగుల్ ఒక గంటలోపే ప్లే స్టోర్ నుంచి యాప్ ను నిషేధించింది. 2021లో పాండే తన భర్తపై గృహ హింసను వెల్లడించారు. చివరకు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి పోరాడి మరణించినట్లు పూనమ్ పాండే టీమ్ వెల్లడించడం విషాదకరం.