https://oktelugu.com/

Poonam Pandey: మంచి కోసం చనిపోతే తప్పేంటి? మీరెప్పుడూ అబద్ధం చెప్పలేదా?

వాస్తవానికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం మంచిదే అయినప్పటికీ.. పూనం ఎంచుకున్న విధానం సరైంది కాదని పలువురు అంటున్నారు.

Written By: , Updated On : February 24, 2024 / 11:36 AM IST
Poonam Pandey
Follow us on

Poonam Pandey: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ఇటీవల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకి చనిపోయినట్టు ఆమె మేనేజర్ ఒక ట్వీట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. మీడియా పూనం పాండే గురించి ప్రముఖంగా వార్త కథనాలు ప్రసారం చేసింది. ఈలోపు పూనం పాండే చనిపోలేదని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆమె చనిపోయినట్టు నాటకమాడిందని తెలిసింది. దీంతో చాలామంది ఆమెపై విమర్శలు చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె తీరును ఖండించారు.

ఆ ఘటన తర్వాత పూనం పాండే మళ్లీ వెలుగులోకి రాలేదు. తాజాగా ఆమె ముంబైలోని ఓ ప్రాంతంలో కనిపించారు. దీంతో విలేకరులు మొత్తం ఆమెను చుట్టుముట్టారు. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ” మీరు ఎప్పుడూ ఏదో రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.. మొన్న కూడా చనిపోయినట్టు సోషల్ మీడియాలో మీ మేనేజర్ ద్వారా ప్రకటించారు. ఒక బాధ్యతాయుతమైన సెలబ్రిటీ అయి ఉండి ఇలా చేయడం సరైనదేనా? దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి కదా? వాటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదా?” అని విలేఖరులు పూనం పాండేను నిలదీసినంత పని చేశారు. దీంతో ఆమె కూడా వారికి తగిన విధంగానే సమాధానం చెప్పింది. “నేను నా స్వార్థం కోసం అబద్ధం చెప్పలేదు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకే ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అయినా అందులో తప్పేముంది? మీరెప్పుడూ అబద్ధం చెప్పలేదా?” అంటూ పూనం విలేకరులకు కౌంటర్ ఇచ్చింది.

వాస్తవానికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం మంచిదే అయినప్పటికీ.. పూనం ఎంచుకున్న విధానం సరైంది కాదని పలువురు అంటున్నారు. చనిపోయినట్టు నాటకం ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు. “సెలబ్రిటీలు చాలామంది సమాజంలో దురాచారాలపై, వ్యసనాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మానుకోలేదు కదా? ప్రజలు తమ ఆహారపు అలవాట్లు, ఇతర వ్యవహారాలను మానుకున్నంతవరకు ఎవరూ ఏమీ చేయలేరని” సామాజికవేత్తలు అంటున్నారు. పూనం పాండే చేసిన పని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వారు పెదవి విరుస్తున్నారు .