Poonam Bajwa: పూనమ్ బజ్వాకు కాలం కలిసిరాలేదు కానీ, లేదంటే వెండితెరను ఊపేయాల్సింది. స్టార్స్ పక్కన నటించే సాలిడ్ ఫిగర్ ఉండి కూడా అదృష్టం ముఖం చాటేయడంతో అరాకొరా ఆఫర్స్ తో నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క సాలిడ్ హిట్ పడినా కథ వేరేలా ఉండేది. ఇప్పటి పూనమ్ బజ్వా గ్లామర్ చూసిన జనాలు సిల్వర్ స్క్రీన్ పై ఈమె ఎందుకు రాణించలేదన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. 2005లో విడుదలైన ‘మొదటి సినిమా’ మూవీతో పూనమ్ వెండితెరకు పరిచయమయ్యారు. నవదీప్ హీరోగా నటించాడు. మొదటి సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.

రెండో మూవీగా ప్రేమంటే ఇంతే చేశారు. అది కూడా ఆమెకు ఫేమ్ తేలేదు. అయినప్పటికీ నాగార్జునతో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. వి ఎన్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన బాస్ మూవీలో పూనమ్ సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్నారు. నయనతార మెయిన్ హీరోయిన్ గా చేశారు. సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ, బాస్ మూవీ ఆడితే పూనమ్ కి బ్రేక్ వచ్చేది. మూడో ప్రయత్నం కూడా కలిరాలేదు. దీంతో ఆమెకు పెద్ద హీరోల చిత్రాల్లో హీరోయిన్ హోదా పోయింది.
పరుగు మూవీలో హీరోయిన్ అక్క పాత్ర చేశారు. అంటే అప్పటికే పూనమ్ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. పరుగు హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయినా పూనమ్ హీరోయిన్ కాకపోవడంతో క్రెడిట్ దక్కలేదు. తెలుగులో టైం బాలేదని కోలీవుడ్ కి వలసెల్లింది. అక్కడ వరసగా టైర్ టూ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. కోలీవుడ్ లో కూడా ఆమె నిలదొక్కుకోలేకపోయారు.

మలయాళం, కన్నడ పరిశ్రమలో ఆఫర్స్ వచ్చాయి కానీ కనీసం ఒక స్థాయి హీరోయిన్ గా నిలబెట్టలేకపోయాయి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పూనమ్ స్టార్ హీరోల చిత్రాల్లో ప్రాధ్యానత ఉన్న రోల్స్ చేస్తున్నారు. పూనమ్ తెలుగులో చివరిగా కనిపించిన మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ కూతుళ్ళలో ఒకరైన లోకేశ్వరి పాత్రను పూనమ్ బజ్వా చేశారు.
కాగా 2020లో దర్శకుడు సునీల్ రెడ్డితో పూనమ్ రిలేషన్షిప్ ప్రకటించారు. వీరిద్దరికీ వివాహం కూడా జరిగిందంటూ ప్రచారం జరిగింది. తర్వాత సునీల్ రెడ్డితో తన రిలేషన్ పై ఎలాంటి అప్డేట్ లేదు. అతడు ఇప్పుడు పూనమ్ తో ఉన్నాడా లేడా అని కూడా సమాచారం లేదు. సాయి ధరమ్ తేజ్ హీరోగా సునీల్ రెడ్డి తిక్క అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. కెరీర్ అలా ఉండగా సోషల్ మీడియాలో పూనమ్ హాట్ ఫోటో షూట్స్ తో సెగలు రేపుతోంది.