Sri Satya Elimination: గత కొద్ది వారాల నుండి బిగ్ బాస్ సీజన్ 6 లో ఎవ్వరు ఊహకు అందని ఎలిమినేషన్స్ జరుగుతూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే..పోయినవారం హౌస్ నుండి సూర్య ఎలిమినేట్ అవ్వడం పెద్ద చర్చకి దారి తీసింది..మొదటి నుండి హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అందరిని అలరిస్తూ వచ్చిన సూర్య కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తారని అందరూ అనుకున్నారు..కానీ అనూహ్యంగా ఆయన ఎలిమినేట్ అవ్వడం పెద్ద షాక్ కి గురి చేసింది.

అంతకు ముందు వారం లో కూడా అర్జున్ కళ్యాణ్ ఎలిమినేషన్ ఇలాంటి చర్చలకు దారి తీసింది..ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి రేవంత్, ఇనాయ సుల్తానా, శ్రీ సత్య, ఆది రెడ్డి , గీతూ , కీర్తి, ఫైమా,ఆదిత్య , మెరీనా మరియు రోహిత్ లు నామినేట్ అవ్వగా వీరిలో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ శ్రీ సత్య మరియు ఆది రెడ్డి అని తెలుస్తుంది.
ఈ వారం అందరికంటే అత్యధిక ఓట్లతో రేవంత్ ఎప్పటిలాగానే నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుండగా..బాలాదిత్య రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు..వీళ్ళ తర్వాతి ఇంటి సభ్యులైన ఇనాయ సుల్తానా మరియు కీర్తి కూడా మంచి వోటింగ్ శాతం తో సేఫ్ జోన్ లోనే ఉన్నారు..ఇక మిగిలిన ఇంటి సభ్యులందరు స్వల్ప ఓట్ల తేడా తో డేంజర్ జోన్ లోనే కొనసాగుతూ వస్తున్నారు..వీరిలో ప్రస్తుతం ఆది రెడ్డి మరియు శ్రీ సత్య డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది..శ్రీ సత్య హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా లో గట్టిగా వినిపిస్తున్న మాట.

ఈ వారం ఇనాయ తో శ్రీ సత్య కి జరిగిన గొడవ శ్రీ సత్య కి మైనస్ గా మరియు ఇనాయ కి ప్లస్ గా మారినట్టు తెలుస్తుంది..మరి వీరిద్దరిలో ఎవరి ఎలిమినేట్ అవ్వబోతున్నారు..సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతునట్టే శ్రీ సత్య ఎలిమినేట్ అవుతుందా..లేదా ఆది రెడ్డి ఎలిమినేట్ అవుతాడా..లేదా వీళ్లిద్దరు కాకుండా ఇంకెవరైనా ఎలిమినేట్ అవుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారిన అంశం.