
Pooja Hegde: పూజా హెగ్డే టైం అసలేం బాగోలేదు. సక్సెస్ ట్రాక్ లో దూసుకెళుతున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. 2021 వరకు ఆమెకు గోల్డెన్ టైం నడిచింది. 2022లో ఫ్లేట్ తిరగబడింది. గత ఏడాది పూజా నుండి ఏకంగా ఐదు సినిమాలు విడుదలయ్యాయి. ఎఫ్ 3లో ఐటెం నెంబర్ చేసింది. ఆ చిత్రం పక్కన పెడితే, ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రాలు నాలుగు. ఒక్కో చిత్రం ఒకదానికి మించిన మరొక డిజాస్టర్. రాధే శ్యామ్ దారుణం అనుకుంటే ఆచార్యతో అంతకు మించిన ప్లాప్ ఇచ్చింది.
ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బీస్ట్ కొంచెం పర్లేదు. చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. ఇక బాలీవుడ్ మూవీ సర్కస్ ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని ఈ దశాబ్దపు చెత్త చిత్రంగా ప్రేక్షకులు అభివర్ణించారు. వరుస పరాజయాలతో పూజా ఫేమ్ పడిపోయింది . గోల్డెన్ లెగ్ కాస్తా ఐరన్ లెగ్ గా మారిపోయింది. ఇప్పుడు పూజా హెగ్డే చేతిలో అధికారికంగా ఉంది రెండు చిత్రాలు మాత్రమే. సల్మాన్ ఖాన్, మహేష్ బాబు చిత్రాల్లో నటిస్తున్నారు.
ఈ రెండు చిత్రాల విజయాల మీదే ఆమె ఆశలు పెట్టుకుంది. సల్మాన్ ఖాన్ తో చేస్తున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మీద పెద్దగా హోప్స్ లేవు. ఈ చిత్రం ఇప్పటికే ట్రోల్స్ కి గురవుతుంది. అయితే రంజాన్ సెంటిమెంట్ కలిసొస్తుందని గట్టిగా నమ్ముతుంది. సల్మాన్ ట్రాక్ రికార్డు చూస్తే ఆయన రంజాన్ చిత్రాలు బాక్సాఫీస్ కొల్లగొట్టాయి. లేదంటే త్రివిక్రమ్ మీదే భారం. పూజాకి బ్రేక్ ఇచ్చింది త్రివిక్రమే. ఫేడ్ అవుట్ దశలో ఉన్న ఆమెకు స్టార్స్ పక్కన ఆఫర్స్ ఇచ్చి వెలుగులోకి తెచ్చాడు.

ఈ రెండు చిత్రాలు ఫలితాలు వచ్చే వరకు పూజా హెగ్డేకు ఆఫర్స్ వచ్చే సూచనలు లేవు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పూజా అనుకుంటున్నారట. ఏజ్ బార్ హీరోలతో అయినా జతకట్టేందుకు సై అంటుందట. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా హీరో ఎవరైనా మంచి రెమ్యూనరేషన్ ఇస్తే నటించేందుకు సిద్ధం అంటున్నారట. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఆమెకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు తక్కువే. అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుంటున్నారట. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీ ఫలితంతో సంబంధం లేకుండా సల్మాన్ తో మరో ఆఫర్ పట్టేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.