
Ugadi Astrology: ఉగాది నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్త పంచాంగం అందుబాటులోకి వస్తుంది. దీంతో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందని పంచాంగ శ్రవణం చేస్తుంటారు. అన్ని రాశుల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అని నాలుగు అంశాల్లో ఎలా ఉందని చెబుతారు. జ్యోతిష్యం ప్రకారం ఉగాది నుంచి ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో మార్పులు తెస్తుంది. కుంభ రాశిలో శని గ్రహ సంచారం వల్ల రాహువు, శుక్ుడు, మేష రాశిలో, కేతువు తులా రాశిలో, కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు.
ధనుస్సు రాశి వారికి ఈ ఏడాది అన్ని శుభాలు కలుగుతున్నాయి. ఏలిన నాటి శని పోయినందున వీరికి పట్టిందల్లా బంగారమే. అదృష్టం బాగుంటుంది. వ్యాపార పరంగా చాలా లాభాలున్నాయి. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కొత్త ఉద్యోగాలు పొందుతారు. కుటుంబంలో పరిస్థితి బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. జీవితంలో ఎంతో ముందుకు వెళతారు. పనుల్లో మందకొడితనం ఉండదు. ఏ పని చేపట్టినా విజయం మీ సొంతం అవుతుంది.
తుల రాశి వారికి కూడా ఈ ఏడాది ఎంతో ఉత్సాహంగా గడుస్తుంది. అనుకూల సమయం వీరికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఏ పని చేసినా అడ్డంకులు రావు. సాఫీగా సాగుతుంది. సమస్యలతో సతమతమయ్యే వారికి సంతోష వార్తలు ఉంటాయి. వృత్తి వ్యాపారంలో శత్రువులు ఆధిపత్యం చెలాయించలేరు. విద్యారంగంలో మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు ఎంతో బాగుంది. చదువులో రాణిస్తారు. మంచి మార్కులు పొందుతారు. ఇలా తులా రాశి వారికి ఎన్నో మంచి ఫలితాలు వీరి సొంతం అవుతాయి.

సింహ రాశి వారికి విశేష ప్రయోజనాలున్నాయి. పూర్వీకుల ఆస్తి పొందేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. మిథున రాశి వారికి కూడా అనుకూల ఫలితాలు వస్తున్నాయి. వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఈ నాలుగు రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ఉగాది నుంచి వీరికి పండగే అని తెలుస్తోంది.