https://oktelugu.com/

సినిమాల్లోకి రాగానే అది వదిలేసిన హాట్ బ్యూటీ!

మోడలింగ్‌ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటి పూజా హెగ్డే. 2012లో తమిళ్‌లో ‘మిస్కిన్’ (తెలుగులో మాస్క్‌) మూవీతో తెరంగేట్రం చేసిందీ ఈ ముంబై ముద్దుగుమ్మ. ‘ముకుంద’తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఈ వెంటనే హిందీ సూపర్ స్టార్ హృతిక్‌ రోషన్‌ సరసన ‘మొహంజొదారో’లో నటించింది. దాంతో, హిందీలో సెటిల్‌ అవుదామనుకున్నా.. ఆ మూవీ ఫెయిలవడంతో ఆమెకు నిరాశే ఎదురైంది. వెంటనే మళ్లీ టాలీవుడ్‌ బాట పట్టింది. అల్లు అర్జున్ సరసన ‘దువ్వాడ జగన్నాధం’తో […]

Written By:
  • admin
  • , Updated On : June 15, 2020 / 05:04 PM IST
    Follow us on


    మోడలింగ్‌ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటి పూజా హెగ్డే. 2012లో తమిళ్‌లో ‘మిస్కిన్’ (తెలుగులో మాస్క్‌) మూవీతో తెరంగేట్రం చేసిందీ ఈ ముంబై ముద్దుగుమ్మ. ‘ముకుంద’తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఈ వెంటనే హిందీ సూపర్ స్టార్ హృతిక్‌ రోషన్‌ సరసన ‘మొహంజొదారో’లో నటించింది. దాంతో, హిందీలో సెటిల్‌ అవుదామనుకున్నా.. ఆ మూవీ ఫెయిలవడంతో ఆమెకు నిరాశే ఎదురైంది. వెంటనే మళ్లీ టాలీవుడ్‌ బాట పట్టింది. అల్లు అర్జున్ సరసన ‘దువ్వాడ జగన్నాధం’తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. ఈ మూవీలో తన అందచందాలతో యూత్‌ హార్ట్‌బీట్‌ పెంచిన ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. దాంతో, తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిందామె. మహర్షి, గద్దలకొండ గణేశ్, అల వైకుంఠపురములో చిత్రాలు హిట్‌ కావడంతో ఆమె అదృష్ట దేవతగా మారిపోయింది. అక్కినేని అఖిల్ ‘మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్’తో పాటు ప్రభాస్‌ 20వ చిత్రంలో ఆమెనే హీరోయిన్‌. నటనతోనే కాదు స్కిన్‌షో కు కూడా వెనుకాడడం లేదామె.‘దువ్వాడ’తో పాటు అల వైకుంఠపురములో చాలా గ్లామరస్‌గా కనిపించింది.

    ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆమె సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటోంది. వాళ్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది. ఈ క్రమంలో కెమెరా ముందు నటించేటప్పుడు భయం అనిపించడం లేదా? తొలి సినిమా సమయంలో మీ ఫీలింగ్ ఏంటి? అని ఓ అభిమాని ప్రశ్నించాడు. దానికి పూజ ఆసక్తికర సమాధానం చెప్పింది. ‘ నాకు సిగ్గు, బిడియం ఎక్కువ. నలుగురిలో మాట్లాడాలన్నా, కనీసం వాళ్ల ముందు నిలబడాలన్నా చాలా సిగ్గు పడేదాన్ని. కానీ, సినిమాల్లోకి రావాలని డిసైడ్‌ అయినప్పుడే ఆ సిగ్గును పూర్తిగా వదిలేశాను. అందుకే కెమెరా ముందు నటించడమంటే కష్టంగా అనిపించదు. ఇప్పుడు మరింత ఈజీగా యాక్ట్‌ చేస్తున్నా’ అని తెలిపింది. తన క్యారెక్టర్‌ను, నటించే సన్నివేశాన్ని దర్శకుడు చెప్పినప్పుడే అందులో లీనమైపోతాను అంది. స్క్రిప్ట్ చూసుకున్న తర్వాత ఎలా నటించాలో నిర్ణయించుకుంటానని చెప్పింది. అలా కెమెరాను ఈజీగా ఫేస్‌ చేయగలనని, ఎక్కువ టేక్‌లు కూడా అవసరం లేదని వివరించింది. సినిమాల్లో నటించాలంటే సిగ్గు, బిడియం పక్కనపెట్టాల్సిందే అని స్పష్టం చేసింది.