
‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొంత విరామం తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పవన్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’పై ప్రేక్షకుల్లోనే కాకుండా టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం ఈ మూవీ చిత్రీకరణ లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పవన్ ఫస్ట్ లుక్, ఓ పాటకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మూవీపై హైప్ మరింత పెంచింది. ఈ మూవీ షూటింగ్ ఈనెల 21 నుంచి తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది. ఇదే ఫైనల్ షెడ్యూల్ అని సమాచారం. ఒరిజినల్ మూవీ ప్రకారం ఇందులో ముగ్గురు హీరోయిన్లకు ఆస్కారం ఉంది. మహిళా హక్కులు, స్త్రీ రక్షణ అనే సోషల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్.. పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటించబోతున్నాడు. తప్పుడు కేసులో ఇరుక్కున్న ముగ్గురు అమ్మాయిలను రక్షించే పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఈ పాత్రల కోసం అంజలి, నివేధా పేతురాజ్, ‘మల్లేశం’ ఫేమ్ అనన్యా నాగల్లను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ‘పింక్’లో తాప్సీ పోషించిన లీడ్ రోల్‌లో నివేదా నటిస్తోందని అంటున్నారు.
అయితే, తాజా సమాచారం మేరకు ఈ మూవీలో ప్రధాన హీరోయిన్ పాత్రను ఇంకా ఫైనలైజ్ చేయలేదగ. ఈ రోల్‌కు శ్రుతి హాసన్‌ను సంప్రదించారట. షూటింగ్ తిరిగి మొదలైన తర్వాత ఆమె సెట్స్‌కు వస్తుందని సమాచారం. అందుకోసమే ఆమె ముంబై నుంచి హైదరాబాద్కు చేరుకుందని పలువురు చెబుతున్నారు. ‘వకీల్ సాబ్’ కోసం తన డేట్స్‌ను కూడా శ్రుతి అడ్జస్ట్ చేసుకుందట. కానీ, పారితోషికం విషయంలోనే నిర్మాతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ఈ మూవీ కోసం ఏడు రోజుల డేట్స్ ఇచ్చిన శ్రుతి 70 లక్షలు డిమాండ్ చేసిందని సమాచారం. సాధారణంగా రోజు పది గంటలు మాత్రమే షూటింగ్ పాల్గొంటుందామె. ఈ లెక్కన ఆమె గంటకు లక్ష రూపాయాలు ఇస్తేనే సంతకం చేస్తుందని అంటున్నారు. మరి, అంత మొత్తం ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ఒప్పుకుంటుందో లేదో చూడాలి.